Begin typing your search above and press return to search.
కంచ ఐలయ్య కోమటోళ్ల కాళ్లు మొక్కాలి!
By: Tupaki Desk | 9 Oct 2017 5:21 PM GMTసామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పేరుతో ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన పుస్తకం సృష్టించిన కలకలం ఇంకా సద్దుమణగడం లేదు. ఐలయ్య సవాల్లు, ఆర్యవైశ్యుల ప్రతి సవాళ్లు...ప్రొఫెసర్ ఇంటి ముట్టడి, పోలీస్ స్టేషన్లో సర్దిచెప్పడం వంటి ఎపిసోడ్లతో ఈ వివాదం జోరుగా ముందుకు సాగుతోంది. తాజాగా ఇది మరో మలుపు తిరిగింది. కోమటోళ్ల కాల్లు కంచ ఐలయ్య మొక్కాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఒక మూర్ఖుడని మండిపడ్డారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కులం అంటగట్టడమంటే...ఆయనది మూర్ఖత్వమేనని ఆరోపించారు. అమిత్‌షా పై ఐలయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మరోసారి ఐలయ్య అమిత్ షా పై కామెంట్ చేస్తే... కేసులు పెడతామని ప్రకటించారు. కంచ ఐలయ్య మెజార్టీ ప్రజల మతాన్ని విచిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ఐలయ్యది...నోరా...మోరా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే ఎందుకు మేధావులు మౌనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఆర్యవైశ్యులకున్న సహనానికి కంచె ఐలయ్య వాళ్ళ కాళ్ళు మొక్కాలని కృష్ణసాగర్ రావు వ్యాఖ్యానించారు. ఐలయ్య మాట్లాడుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని కృష్ణసాగర్ రావు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఆర్యవైశ్యుల మద్దతు అవసరం లేదా అని ప్రశ్నించారు. కంచె ఐలయ్య కామెంట్స్ పై ఎందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కోమట్లు ఐలయ్యపై.. క్రిమినల్ డిఫమేషన్ అన్ని జిల్లాలో వేసి కోర్టుకు లాగాలని ఆయన సూచించారు.
కేరళలో సీపీఎం హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయని కృష్ణసాగర్ రావు ఆరోపించారు. సీపీఎం హత్య రాజకీయలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. కమ్యూనిస్టు దేశాల్లో ఒకే పార్టీ విధానం ఉందని...బహుళ విధాల పార్టీ ఉన్న భారతదేశంలో కమ్యూనిస్టులకు పనిలేదని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు పార్టీకి మనదేశంలో కనుమరుగయిందని తెలిపారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీ హింస రాజకీయలు పాల్పడుతోందని ఆరోపించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కమ్యూనిస్టు పార్టీ నడుపుకుంటున్నారని ఆరోపించారు. సీఎం వాఖ్యలపై కామెంట్ చేసిన కండక్టర్ కు ప్రభుత్వం నోటీసులుందని తెలిసిందని...దీని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రజలు అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కూడా లేదని వ్యాఖ్యానించారు.