Begin typing your search above and press return to search.
ప్రభాస్ ను ఇబ్బందుల్లోకి నెట్టిన కృష్ణంరాజు!
By: Tupaki Desk | 8 July 2019 4:27 AM GMTఆపరేషన్ తెలుగు రాష్ట్రాలను మొదలు పెట్టిన బీజేపీకి ఇప్పుడు ఎవ్వరూ వచ్చినా కండువా కప్పేసి చేర్చుకొని బలపడాలని ప్లాన్ చేస్తోంది. మొన్ననే మాజీ కాంగ్రెస్ సీఎం నాదెండ్లకు కండువా కప్పిన అమిత్ షా చేరికలకు ద్వారాలు తెరిచారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి సినీ గ్లామర్ అద్దేందుకు ఫోకస్ చేశారట..
తాజాగా బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న రెబల్ స్టార్ - కేంద్రమాజీ మంత్రి కృష్ణం రాజు ద్వారా టాలీవుడ్ చేరికలను ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారట కమళనాథులు..ఇప్పటికే పలువురు చోటా మోటా నేతలు బీజేపీలో చేరారు. ఇప్పుడు పెద్ద స్టార్లకు గాలం వేస్తున్నారు.
బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ను బీజేపీలోకి చేర్చడానికి ఆయన పెదనాన్న అయిన కృష్ణంరాజు ద్వారా నరుక్కురావాలని డిసైడ్ అయ్యారట.. ఈ మేరకు అమిత్ షా హైదరాబాద్ లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దిశానిర్ధేశం చేశారు.
ఈ కార్యక్రమంలోనే మాట్లాడిన కృష్ణం రాజు తన ఫ్యాన్స్ - దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ బీజేపీలో చేరి దేశం కోసం పనిచేయాలని పిలుపునివ్వడం విశేషం. కాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు కృష్ణం రాజు ఇలా పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది.
సినిమాలు, రాజకీయాలు రెండు వేర్వేరుగా కాదు.. చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాలతో ముడిపడి ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ గా కూడా అన్ని పార్టీల కార్యకర్తలున్నారు. మరి కృష్ణం రాజు ఇచ్చిన పిలుపును తీసుకొని బీజేపీలో చేరుతారా? రాజకీయాలంటేనే పడని.. ఆమడ దూరం ఉండే ప్రభాస్ దీనిపై ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తిగా మారింది.