Begin typing your search above and press return to search.
ఇక పార్టీలోనూ కృష్ణంరాజు ‘రెబల్’ ఇజమే..
By: Tupaki Desk | 31 July 2019 11:08 AM GMTకృష్ణం రాజు.. రెబల్ స్టార్.. వెండితెరపై సీరియస్ వేశాలు వేసే మన స్టార్ హీరో పాలిటిక్స్ లో మాత్రం అంత సీరియస్ గా ఉండరనే ప్రచారం ఆయనను రాజకీయాలు చూసిన వారందరికీ అర్థమవుతుంటుంది. అప్పుడెప్పుడో 1991లో రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణం రాజు కాంగ్రెస్ లో చేరి నర్సాపురం ఎంపీగా పోటీచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. వాజ్ పేయి హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేసి జాతీయ స్థాయి నేతగా మారారు.
అయితే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరడమే కృష్ణం రాజుకు పెద్ద మైనస్ అయ్యింది. పీఆర్పీ తరుఫున 2009లో రాజమండ్రి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యి మళ్లీ 2014కు ముందు బీజేపీలో చేరారు. సీనియర్ అయిన ఈయనకు గవర్నర్ పదవి వస్తుందని అంతా ఆశించినా అది నెరవేరలేదు..
మధ్యలో పీఆర్పీలో చేరడం.. పైగా బీజేపీలో ఉన్న ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ గా, సీరియస్ గా, ప్రత్యర్థులపై దూకుడుగా లేరని కృష్ణం రాజును గవర్నర్ గిరీకి బీజేపీ అధిష్టానం ఎంపిక చేయలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరిగిందట.. ఈ విషయం తెలుసుకున్న కృష్ణం రాజు ఇప్పుడు మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ మొదలు పెట్టారట..
బీజేపీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకొని చంద్రబాబు, జగన్ లను టార్గెట్ చేసుకొని ఇప్పుడు కృష్ణం రాజు పరుష విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే కృష్ణం రాజు ఇలా మళ్లీ రాజకీయాల్లో రెబల్ గా మారడం చూసి అందరూ గవర్నర్ గిరీ కోసమే ఇదంతా అని చెవులు కొరుక్కుంటున్నారట..