Begin typing your search above and press return to search.

కృష్ణంపట్నం మందు పంపిణీకి బ్రేక్ .. కారణం ఇదే!

By:  Tupaki Desk   |   21 May 2021 9:57 AM GMT
కృష్ణంపట్నం మందు పంపిణీకి బ్రేక్ .. కారణం ఇదే!
X
కృష్ణపట్నం... ప్రస్తుతం ఈ పేరు దేశం మొత్తం ధ్వని పలుకుతోంది. కారణం పట్టిపీడిస్తోన్న దేశాన్ని కరోనా మహమ్మారికి కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు కరోనాకు మందు కనిపెట్టాడు. అలాగే ఈ మందు వాడితే , కరోనా తగ్గుతుంది అంటూ వార్తలు కూడా రావడంతో గత కొద్దిరోజులుగా వేల సంఖ్యలో ప్రజలు ఆ మందు కోసం తరలివస్తున్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో ఆయుర్వేద మందుకు డిమాండ్ పెరిగింది. లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడం, మందు తీసుకున్న వారిలో చాలామంది కోలుకున్నట్లు తెలియడంతో శుక్రవారం నుంచి మందును తిరిగి పంపిణీ చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డి ప్రకటించారు. అలాగే ఆయుష్‌ ల్యాబ్‌ నుంచి గురువారం రాత్రి 9 గంటలకు వచ్చిన రిపోర్టుల ప్రకారం ఈ మందులు హానికరం కావని తేలింది. అలాగే ప్రమాణాలకు లోబడి కూడా ఉందని రిపోర్టులో స్పష్టం చేసినట్లు సమాచారం.

దీనితో అక్కడ తెల్లవారుజామున నుంచే క్యూ కట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు 25వేల మంది ప్రజలు కృష్ణపట్నానికి తరలివచ్చారు. మార్గమధ్యలో కొన్ని వందల వాహనాలు నిలిచిపోవడంతో శుక్రవారం సుమారు 50వేల మంది కరోనా మందు కోసం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, తమ వద్ద కేవలం 5వేల మందికి సరిపడా మందు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లు కూడా లేకపోవడంతో ఒకరిపై ఒకరు పడి తోపులాట జరిగింది. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ క్రమంలోనే కొందరు కిందపడిపోయారు. ఈ గందరగోళంతో ఆయుర్వేద మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వైద్యుడు ఆనందయ్య, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ప్రకటించారు.

క‌రోనా సోకిన రోగులు అంబులెన్స్ లో అక్క‌డికి వ‌స్తుండ‌టంతో మాములు ప్ర‌జలు ఆందోళ‌న చేశారు. జ‌నాలు పెద్ద ఎత్తున త‌ర‌లిరావ‌డంతో మందు పంపిణీవ‌ద్ద సోష‌ల్ డిస్టెన్స్ క‌నిపించ‌లేదు. ఇక కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్ కావ‌డంతో ఈరోజు ఆయుర్వే మందు పంపిణీని నిలిపేశారు. ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. నెల్లూరు ఆయుర్వేదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీనిపై సీఎం జగన్ తన సమీక్ష సమావేశంలోనూ చర్చించారు. దీనికి అనుమతి ఇచ్చే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. నెల్లూరుకు వైద్యులు, శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాలన్నారు. ఆయుర్వేద మందు గుణగణాలపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులకు నిర్దేశించారు. ఆ తర్వాతనే దానిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే .. ఆనందయ్య కరోనా మందు తీసుకోవడంతోనే తన ప్రాణాలు నిలబడ్డాయంటూ అనేక మంది కరోనా నుంచి బయటపడ్డ వాళ్లు చెప్పుకొస్తున్నారు. ఊపిరి అందడంలేదు. కొన ఊపిరితో ఉన్న నాకు ఇంకా రెండు నిముషాలు ఆగితే చనిపోయే పరిస్థితి. ఈ క్రమంలో మావాళ్లు వచ్చి వెంటనే కంటిలో మందు వేశారు. 10, 15 నిముషాల్లో కోలుకున్నా.. ఈ మందు చాలా అద్భుతం అని కృష్ణపట్నం మందు వేసుకున్న ఓ రిటైర్డ్ మాస్టారు చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టడం మొదలైంది.