Begin typing your search above and press return to search.

అనుకుంటాం కానీ కేటీఆర్ ను క‌ల‌వ‌టం చాలా ఈజీ!

By:  Tupaki Desk   |   8 Feb 2019 5:38 AM GMT
అనుకుంటాం కానీ కేటీఆర్ ను క‌ల‌వ‌టం చాలా ఈజీ!
X
చాలామందికి టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను క‌ల‌వ‌టం క‌ష్ట‌సాధ్య‌మైన విష‌యంగా చెబుతుంటారు. అయితే.. క‌ష్టంలో ఉన్న వారికి.. సాయం త‌ప్ప‌నిస‌రి అయిన వారికి అందుబాటులోకి రావ‌ట‌మే కాదు.. వారి వెత‌ల్ని విని వెంట‌నే రియాక్ట్ అయ్యే తీరు ఆయ‌న‌లో క‌నిపిస్తూ ఉంటుంది. త‌న చేత‌ల ద్వారా తాను అంద‌రికి అందుబాటులోకి ఉంటాన‌న్న భావ‌న‌ను క‌లుగ‌జేస్తుంటారు.

తాజా ఉదంతంలో అదే తీరును మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు కేటీఆర్. చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల్ని పోగొట్టుకొని నాన‌మ్మ ద‌గ్గ‌ర పెరిగిన యువ‌తి వివాహానికి కేటీఆర్ రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందించి త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా తంగ‌ళ్ల‌ప‌ల్లి మండ‌లం బ‌ద్దెన‌ప‌ల్లికి చెందిన మౌనిక చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రులు చ‌నిపోయారు.

నాన్న‌మ్మ ద‌గ్గ‌ర పెరిగిన ఆమెకు ఇటీవ‌ల పెళ్లి ఖ‌రారైంది. అయితే.. పెళ్లి ఖ‌ర్చుల‌కు చేతిలో డ‌బ్బులు లేని ప‌రిస్థితి. ఇదే స‌మ‌యంలో జిల్లాకు కేటీఆర్ వ‌స్తున్నార‌న్న విష‌యాన్ని తెలుసుకొని.. ఆయ‌న్ను క‌లిసేందుకు వెళ్లింది. స్థానిక నాయ‌కుల సాయంతో కేటీఆర్ క‌లిసిన ఆమె.. త‌న క‌ష్టం గురించి చెప్పుకొచ్చింది.

ఆమె స‌మ‌స్య తీవ్ర‌త‌ను గుర్తించిన కేటీఆర్ వెంట‌నే స్పందించారు. ఆమెకు సాయం చేస్తాన‌ని మాటిచ్చారు. నేత‌ల ద్వారా ఆమె దీన ప‌రిస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్ వెంట‌నే రూ.50వేల న‌గ‌దు సాయాన్ని ఆమెకు అందేలా చేశారు. పెళ్లి మండ‌పంలో కేటీఆర్ పంపిన రూ.50వేల‌ను అందించారు. పేద యువ‌తి క‌ష్టం గురించి తెలిసిన వెంట‌నే రియాక్ట్ అయిన తీరును ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.