Begin typing your search above and press return to search.
బాబు నవ్వితే.. కేటీఆర్ నవ్వుతారా? ఇదేం లెక్క మంత్రిగారు?
By: Tupaki Desk | 8 Oct 2022 5:25 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుర్తుకు వచ్చినంతనే ఆయన సీరియస్ ముఖమే గుర్తుకు వస్తుంది. ఇదే విషయాన్ని అప్పట్లో దివంగత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ ప్రస్తావిస్తూ దెప్పి పొడిచేవారు. నవ్వాలంటూ ఎటకారం ఆడేసేవారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాటల ప్రభావమో ఏమో కానీ.. ఆ తర్వాత నుంచి చంద్రబాబు ముఖంలో అప్పుడప్పుడు నవ్వు కనిపించటం మొదలైంది. మనిషిలోనూ మార్పు మొదలైంది. సీరియస్ గా ఉండకుండా.. సందర్భానికి అనుగుణంగా అప్పుడప్పుడు నవ్వే అలవాటు ఆయనలో మొదలైంది.
ఇప్పుడు ఆ నవ్వే మరోసారి వార్తాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ పేరును మారుస్తూ.. జాతీయరాజకీయాల నిర్ణయంపై చంద్రబాబును స్పందించమని కోరితే.. ఆయన ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు. ఆ నవ్వులో ఎవరికి వారు.. వారికి తోచిన సమాధానాన్ని వెతుక్కుతున్నారు.
నిజానికి చంద్రబాబుకు ఉన్న లక్షణం.. ఆయన్ను ఏదైనా అడిగితే స్పందిస్తూ.. సమాధానం ఇచ్చేస్తారు తప్పించి.. ఇంకోలా రియాక్టు కావటం ఆయనకు పెద్దగా రాదనే చెప్పాలి. తన అలవాటుకు భిన్నంగా బీఆర్ఎస్ పై రియాక్టు అయ్యారని చెప్పాలి. జాతీయ పార్టీ పెడుతున్న వేళలో.. చంద్రబాబుతో మాట్లాడారా? అన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి కేటీఆర్ కాస్తంత భిన్నంగా రియాక్టు అయ్యారు.
అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు చెబుతామని చెప్పిన కేటీఆర్.. 'చంద్రబాబుతో మాట్లాడారా?' అన్న ప్రశ్నకు బదులిస్తూ.. విలేకరులు బాబును అడిగితే నవ్వారు కదా? నా సమాధానం కూడా నవ్వే అంటూ బదులివ్వటం గమనార్హం.
చంద్రబాబు నవ్వు కేటీఆర్ ఉడికించిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. చిన్న పిల్లాడి మాదిరి చంద్రబాబు నవ్వారు కాబట్టి.. నా సమాధానం నవ్వే అని చెప్పటంలో అర్థం లేదనే మాట వినిపిస్తోంది. అయినా.. బాబు రియాక్షన్ కు కేటీఆర్ అంతలా రియాక్టు కావాల్సిన అవసరం ఉందంటారా?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.