Begin typing your search above and press return to search.
మోడీ ఏం చేయాలో చెప్పే కేటీఆర్.. తెలంగాణ బకాయిల మాటేంది?
By: Tupaki Desk | 15 Feb 2020 10:06 AM GMTప్రపంచంలో సులువైన పని ఏమైనా ఉందంటే.. అది సలహాలు ఇవ్వటం. నువ్వు అది చేయలేదు. ఇది చేయలేదని చెప్పటం. వినేటోళ్లు ఉంటే చెప్పేటోళ్లు ఏమైనా చెబుతారన్న ఎక్కెసం కొందరి నోట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అదే పనిగా కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రాలకు మరింత అధికారాలు ఇవ్వాలని.. ఆర్థిక స్వేచ్ఛ మరింత కల్పించాలన్న వాదనను వినిపిస్తున్నారు.
ఒకటి తర్వాత ఒకటిగా సాగుతున్న సదస్సులకు హాజరవుతున్న ఆయన మాటలు చూస్తుంటే.. కేంద్రం తన కర్ర పెత్తనాన్ని తగ్గించుకోవాలన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లుగా చెప్పాలి. ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం కావాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని.. కేంద్రం అలాంటి నిర్ణయాలు తీసుకో లేదని తేల్చేశారు. రెండు మూడేళ్లు గా దేశ ఆర్థిక వ్యవస్థ మంద గమనంలో ఉందన్న ఆయన.. రాష్ట్రాలు ఎంత వేగంగా ఎదిగితే దేశం అంత వేగంగా ఎదుగుతోందని చెప్పారు.
రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. సేవా.. పర్యాటకం.. వైద్యం.. విద్య తదితర రంగాల్లో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలన్న కేటీఆర్.. ఉమ్మడి జాబితా లో ఉన్న అనేక అంశాల్ని రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. బంగ్లాదేశ్.. వియత్నాం లాంటి చిన్న దేశాలు ఎలక్ట్రానిక్స్.. టెక్స్ టైన్.. అపెరెల్ రంగంలో ముందున్నాయనే విషయాన్ని గుర్తించాలననారు.
మోడీ ప్రభుత్వం చెప్పే మేకిన్ ఇండియా.. అసెంబ్లింగ్ ఇన్ ఇండియాగా మారిందన్న చురకలువేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందాలంటే భారీ ప్రాజెక్టుల గురించి ఆలోచించాలన్న ఆయన.. తెలంగాణ లో భారీగా సాగునీటి ప్రాజెక్టుల తో పాటు.. ప్రపంచంలోని పలు పెద్ద ఫార్మా క్లస్టర్లలో ఒకటైన హైదరాబాద్ ఫార్మా సిటీ.. దేశంలోని అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్ వరంగల్ లో ఏర్పాటు చేయటం ద్వారా ప్రపంచం తో పోటీ పడే పని చేస్తున్నామన్నారు. ఇన్ని సలహాలు.. సూచనలు చేస్తున్న కేటీఆర్ ఆరేళ్ల తమ పాలన లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని మిగులు లో నుంచి లోటులోకి ఎందుకు తీసుకెళ్లారన్న ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతారు?
ప్రస్తుతం రాష్ట్రం మెడకు రూ.20వేల కోట్ల బకాయిలు వేలాడుతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందన్న దానికి ఏమని బదులిస్తారు? అలా ఉండాలి. ఇలా చేయాలని సలహాలు ఇచ్చే ముందు..తామేం చేశామన్న విషయాన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఉందన్నది మర్చిపోకూడదు. మెరుపుల్ని లేశ మాత్రంగా చెప్పి.. మరకల్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది చిన్నసారు ఎప్పుడు గుర్తిస్తారో?