Begin typing your search above and press return to search.
తుపాకీ ఎక్కుపెట్టిన కేటీఆర్...కౌంటింగ్ రోజున హల్ చల్
By: Tupaki Desk | 11 Dec 2018 4:26 AM GMTఐదు రాష్ర్టాల ఎన్నికల సందర్భంగా అందరి చూపు కౌంటింగ్ పైనే పడిన సంగతి తెలిసిందే. తెలంగాణ - ఛత్తీస్ గఢ్ - మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - మిజోరాం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 43 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. 119 నియోజకవర్గాలకు గానూ 1821 మంది అభ్యర్థులు బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న జరిగిన పోలింగ్ లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతో పాటు 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
ఇలా అందరి చూపు కౌంటింగ్ వైపున్న సమయంలో తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్ ప్రొఫైల్ పిక్ మార్చడం పెద్ద చర్చగా మారింది. గన్ గురిపెట్టినట్టుగా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. తెలంగాణ అసెంబ్లీలో ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు ఉండబోతున్నాయని ఇప్పటికే ప్రకటించిన కేటీఆర్... ఫలితాల ముందు విపక్షాలపై గన్ ఎక్కుపెట్టారనే కామెంట్లు చేస్తున్నారు.