Begin typing your search above and press return to search.
రాహుల్ రాకతో అలర్టయిన కేటీఆర్... వరంగల్‌లో ఇంకో ప్లాన్
By: Tupaki Desk | 3 May 2022 3:02 AM GMTకాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఈ వారంలో తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనలో మే 6 , 7వ తేదీల్లో వరంగల్, హైదరాబాద్ లలో పర్యటించనున్నారు. మే 6వ తేదీన సాయంత్రం హనుమకొండలో జరిగే రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ మీటింగ్ ను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
రైతు అంశాలే ఎజెండాగా డిక్లరేషన్ ప్రకటించబోతున్నారని ప్రచారం సాగుతోంది. సహజంగానే ఈ సమావేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపై స్పందించనున్నారు. దీంతో రాహుల్ కు కౌంటర్‌గా టీఆర్ఎస్ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ తనయుడైన మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు.
వరంగల్ సభ ద్వారా రైతులకు మద్దతు ధర, పంట పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోళ్లు వంటి అంశాలతో పాటు తాము అధికారంలోకి వస్తే రైతుల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామో అనే అంశాలు ఉండేలా కాంగ్రెస్ పార్టీ డిక్షరేషన్ రూపొందించనట్లు సమాచారం.
కాంగ్రెస్ నేతలు రాహుల్ టూర్‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే, దీనికి కౌంటర్‌గా టీఆర్ఎస్ ఎంట్రీ ఇస్తోంది. రాహుల్ గాంధీ సభ నిర్వహించిన మరుసటి రోజే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు రానున్నారు.
ఈ టూర్ సందర్భంగా కైటెక్స్ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన, భూమి పూజ, గణేష్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ ప్రారంభం వంటి కార్యక్రమాలలో కేటీఆర్ పాల్గొననున్నారు. దీంతో పాటు హనుమకొండలోని పీజేఆర్ గార్డెన్స్ లో ఐటీ ప్రొఫెషనల్స్ తో ఇంటరాక్షన్ ఉండబోతోంది. అనంతరం జిల్లా ప్రజా ప్రతినిధులతో భేటీ కానున్నారు.
కాంగ్రెస్ సభ తరువాతి రోజే కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించడం వెనుక రాహుల్ కు కౌంటర్ ఇచ్చేందుకే ఈ పర్యటన ఉండబోతోందని అంటున్నారు. దీనికి కారణం, గత నెల 20వ తేదీన కేటీఆర్ వరంగల్ లో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వమే టార్గెట్ గా బీజేపీ, కాంగ్రెస్ తీరుపై తూర్పారబట్టారు. స్వల్ప వ్యవధిలోనే ఆయన ఓరుగల్లు టూర్‌కు రావడం అంటే రాహుల్ టూర్‌కు కౌంటర్ కోసమేనని అంటున్నారు.