Begin typing your search above and press return to search.
మారుతి సందేహం తీర్చిన కేటీఆర్!
By: Tupaki Desk | 17 July 2019 12:12 PM GMTచెన్నై వాటర్ క్రైసిస్ ... చూసి దేశం ఒక్కసారిగా జడుసుకున్న విషయం తెలుసుకదా. చాలామంది ఇలాంటి కష్టం హైదరాబాదుకు వస్తే పరిస్థితి ఏంటి దేవుడా అని ఆందోళన చెందారు. 2020 నాటికి హైదరాబాదుదీ అదే పరిస్థితి అంటూ వచ్చిన వార్తను చూసి యాంకర్ అనసూయ మరికొందరు ఆందోళన చెందుతూ ఇటీవలే దీనిపై ట్వీట్స్ పెట్టారు. ఇది నెల క్రితం సంగతి.
తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు సత్ఫలితాల గురించి కేటీఆర్ ఒక ట్వీట్ వేయగా... దానిపై సందేహం వ్యక్తం చేస్తూ హైదరాబాదులో మరో 48 రోజులకు సరిపడా మాత్రమే నీళ్లున్నాయన్న ఒక ఆంగ్ల మీడియా వార్తను షేర్ చేస్తూ దర్శకుడు మారుతి చేసిన ఇది నిజమా కేటీఆర్ గారు అంటూ ట్వీటు చేశారు. దీనికి కేటీఆర్ హైదరాబాదుకు ఎలాంటి ఇబ్బంది లేదని సవివరంగా ఇచ్చిన రిప్లయి బాగా వైరల్ అవుతోంది.
మారుతి ట్వీటును రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ... ఇది సంపూర్ణ నివేదిక కాదు. మరి కొన్ని వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి రిజర్వాయరుకు నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి హైదరాబాదు అవసరాలకు సరిపడా 172 ఎంజీడీ నీళ్లు హైదరాబాదుకు నీళ్లందించే రిజర్వాయర్లకు పంప్ చేస్తారు. అలా అని చెప్పి...ఎడాపెడా నీళ్లు వాడేయొద్దని నగర ప్రజలకు విజ్జప్తి చేశారు కేటీఆర్. తాగునీటి ప్రాధాన్యత - కొరత గుర్తించి నీటి సద్వినియోగం - వాటర్ హార్వెస్టింగ్ కు తమ వంతు చర్యలు తీసుకోవాలని కోరారు.
కేసీఆర్ నిరంతర పట్టుదల - దూరదృష్టి వల్ల హైదరాబాదు నీటి సమస్య ఎదుర్కోకముందే పరిష్కారం పొందిందని సంతోషం వ్యక్తం చేశారు కేటీఆర్. దీంతో ఇతర నగరాల్లాగా ఎప్పటికీ హైదరాబాదు నీటి కష్టాలు ఎదుర్కోదు అని స్పస్టంగా కేటీఆర్ వివరించారు.
వీరిద్దరి డిస్కషన్ పై జీహెచ్ ఎంసీ కమిషనరు స్పందిస్తూ మరింత లోతైన సమాచారం ఇచ్చారు.
హైదరాబాదు అవసరాలకు రోజుకు 420 ఎంజీడీల నీరు అవసరం. ఎల్లంపల్లి (కాళేశ్వరం) ద్వారా మనకు 172 ఎంజీడీల నీరు అందుతుంది. కృష్ణా నది నుంచి 270 ఎంజీడీల నీరు అందుతుంది. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీకి చేరుకున్నా కూడా ఏడాది పొడుగునా 270 ఎంజీడీల సరఫరాకు ఏం అంతరాయం కలగకుండా ఏర్పాట్లున్నాయి. దేశంలోనే తాగునీటి కొరత లేని నగరం మన హైదరాబాదే. కించిత్ చింత కూడా అవసరం లేదని జీహెచ్ ఎంసీ కమిషనర్ దానకిషోర్ విపులంగా చెప్పారు. ఇటీవల కేసీఆర్ ప్రత్యేక సమీక్ష చేసి నిరంతరం హైదరాబాదు వద్ద 5 టీఎంసీలు నీరు నిల్వ ఉండేలా ఏర్పాట్లు చేసి అలాగే - ఏటా అదనంగా 10 టీఎంసీల నీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఆదేశాలు జారీచేశారు. కాళేశ్వరం నుంచి కేశవరం ద్వారా హైదరాబాదుకు ఈ తాగునీటి సరఫరా నిరంతరాయంగా జరగడానికి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు కమిషనర్ దానకిషోర్ వెల్లడించారు.
మారుతి ట్వీట్ వల్ల హైదరాబాదీయులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ తెలిసిందన్నమాట.