Begin typing your search above and press return to search.

సీఎం పదవి కోసం కేటీఆర్.. హరీశ్ లు పోటీ పడ్డారు

By:  Tupaki Desk   |   8 Oct 2021 12:12 PM IST
సీఎం పదవి కోసం కేటీఆర్.. హరీశ్ లు పోటీ పడ్డారు
X
బాగున్నంత కాలం అంతా బాగున్నట్లే ఉండటం.. ఆ తర్వాతే అసలు లెక్కలన్ని బయటకు రావటం రాజకీయాల్లో మామూలే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడిగా.. విధేయుడిగా ఉన్న ఈటల రాజేందర్ మీద హటాత్తుగా భూకబ్జా ఆరోపణలు రావటం.. మంత్రి పదవిని పీకి పారేయటం.. అనంతరం పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేయటంలో కేసీఆర్ కదిపిన పావుల గురించి తెలిసిందే. తనను అవమానించారంటూ ఈటల.. తన పదవికి పార్టీకి రాజీనామా చేయటంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రావటం తెలిసిందే.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. ఎన్నికల ప్రచారాన్ని మమ్మరం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఈటల మీద మంత్రి హరీశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయన తీరును తప్పు పడుతున్నారు. ఒకప్పుడు తనకెంతో సన్నిహితంగా ఉన్న హరీశ్.. ఇప్పుడు కేసీఆర్ కు అత్యంత విధేయుడిగా మారిన వైనాన్ని ప్రస్తావించటమే కాదు..హరీశ్ ఎంతటి అబద్ధాలు చెబుతారో తెలుసా? అంటూ ఆయన మండిపడుతున్నారు. అంతేకాదు.. తొలిసారి ఆయన నోటి నుంచి కీలక వ్యాఖ్య ఒకటి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్.. హరీశ్ లు పోటీ పడ్డారంటూ సంచలన వ్యాఖ్య చేశారు.

ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తన ప్రచారాన్ని మమ్మురం చేస్తున్నారు ఈటల. మంత్రిగా ఉన్న వేళలో తానేం చేశానన్న విషయాన్ని వివరించటమే కాదు.. తనపై విమర్శలు చేస్తున్న మంత్రి హరీశ్ ను ఉతికి ఆరేస్తున్న ఈటల.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను వదిలి పెట్టటం లేదనే చెప్పాలి. తాజాగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఈటల.. సీఎం కేసీఆర్.. మంత్రి హరీశ్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటమే కాదు.. వారి మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. బట్టలు విప్పే ప్రోగ్రాం చేశారని చెప్పాలి. ఈటల చేసిన కీలక వ్యాఖ్యల్ని చూస్తే..
- దళిత జాతి ఆత్మగౌరవం కోసం తన చిన్ననాడే కొట్లాడి కుల బహిష్కరణకు గురయ్యా. అలాంటి కుటుంబం మాది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నా. కేసీఆర్‌తో ఆరేళ్లుగా అనుభవిస్తున్న బాధ నుంచి విముక్తి పొందా.

- చెబితే వినే రకం కేసీఆర్ కాదని.. ఆయనకు అంత గొప్పమనసు లేదు. తనకు మాత్రమే తెలివి ఉందని అనుకునే వ్యక్తి కేసీఆర్. 2018లోపే మాలాంటి వాల్ల బొండిగ పిసకాలని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన వాడికి డబ్బులు ఇచ్చి కరపత్రాలు కొట్టించారు.

- కాంగ్రెస్ అభ్యర్థికి డబ్బులు ఇచ్చి తనను ఓడగొట్టాలని చూశారు. జెండాకి ఓనర్లం తామేనని గొంతెత్తి మాట్లాడితేనే హరీశ్ రావుకు మంత్రి వచ్చింది. పదవుల కోసం పెదవులు మూసిందని హరీశ్ రావే.

- ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్, హరీశ్ రావు పోటీ పడ్డారు. కేసీఆర్ కుటుంబంలో అంతా అబద్ధాల కోరులే. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి.. కేసీఆర్ మోసం చేశారు. ఉపముఖ్యమంత్రిని చేసి ఆ తర్వాత తొలగించి అవమానించారు. కేసీఆర్ ప్రభుత్వంలో దళిత అధికారులకు గౌరవం లేదు.

- ప్రదీప్ చంద్రకు కేసీఆర్ ఇచ్చిన గౌరవం ఏంది? అకునూరి మురళి ఉసురు పోసుకున్నవాడు కేసీఆర్.. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో చదివే పిల్లలు ఎవరెస్ట్ అంత ఎదగాలని ఆశించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పొమ్మనలేక పొగబెట్టి బయటకు పంపించిండు.

- హుజూరాబాద్ ఉపఎన్నికల కోసమే దళితబంధు తీసుకొచ్చారు. 45 వేల ఓట్లు ఉన్న కులం మన దళితులు. లెక్క చూసుకుని ఓట్ల కోసం రూ.10 లక్షల స్కీం తీసుకువచ్చిండు. నేను రాజీనామా చెయ్యకపోతే దళితుబంధు వచ్చేదా? మన పుట్టుకకు కారణమైన అమ్మనాన్నలను ఎలా మర్చిపోమో.. నన్ను కూడా మర్చిపోవద్దు. మైనార్టీలకు కూడా దళితబంధు ఇవ్వాలి.