Begin typing your search above and press return to search.
యాగానికే స్పెషల్ అట్రాక్షన్ గా వారిద్దరు
By: Tupaki Desk | 24 Dec 2015 4:10 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత హోదాలో నిర్వహిస్తున్న అయుత చండీయాగం బుధవారం షురూ అయ్యింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు మొదలు.. అధికారపక్ష నేతలంతా హాజరయ్యారు. వీరితో పాటే.. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మొదలు ముఖ్య అధికారులంతా చండీయాగంలో తలమునకలైపోయారు. ఇంత భారీగా యాగానికి వచ్చినా అందరి కళ్లు.. ఇద్దరి మీద ప్రత్యేకంగా చూశాయి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో కాదు.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. బావ బావమరుదులైన హరీశ్ రావు.. కేటీఆర్ లే.
అయుత చండీయగానికి వచ్చిన వారంతా బావ బావమరుదుల్ని ఆసక్తిగా గమనించటం కనిపించింది. తెల్లటి ఫ్యాంట్.. చొక్కాతో హరీశ్ సాదాసీదాగా.. ఎప్పటిమాదిరే కనిపిస్తే.. వైట్ లాల్చీ పైజమాతో సంప్రదాయ వేషధారణతో కేటీఆర్ లు కనిపించారు. వీరిద్దరూ హుషారుగా.. ఒకరికొకరు కులాశాగా మాట్లాడుకోవటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఇద్దరూ టీఆర్ఎస్ పార్టీలో రెండు గ్రూపులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న ఆరోపణ ఉంది. వీరిద్దరి మధ్య అధిపత్య పోరు నడుస్తుందన్న విమర్శలు ఉన్నాయి. అయితే.. ఈ తరహా వ్యాఖ్యలు చేసే వారిని నిలువరించటం.. తమ మధ్యన అలాంటివేమీ లేవంటూ ఖండించటం మామూలే. అయితే.. వీరి మధ్య ఉన్న దూరం బహిరంగ రహస్యంగానే చెప్పొచ్చు.
దీనికి బలం చేకూరుస్తూ వీరిద్ధరూ కలిసి పాల్గొనే కార్యక్రమాలు తక్కువే. అదే సమయంలో.. పార్టీ అంతర్గత సంభాషణల్లో వీరిద్దరి మధ్య సానుకూల సంబంధాలు లేవన్న విషయం ఓపెన్ గానే మాట్లాడుకుంటుంటారు. అయితే.. కేసీఆర్ పట్ల వీరిద్దరికున్న భయభక్తుల పుణ్యమా అని తమ అసంతృప్తిని హద్దుల్లో ఉంచుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. అలాంటి వీరిద్దరూ యాగానికి వచ్చిన వీవీఐపీల వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకున్నారు. అతిధుల్ని ఆహ్వానించటం కనిపించింది. యాగానికి వచ్చిన గవర్నర్ నరసింహన్ దంపతులతో హరీశ్.. కేటీఆర్ లు చాలాసేపు మాట్లాడుతూ ఉండటం కనిపించింది. అతిధులకే కాదు.. సొంత మంత్రులను సైతం స్వాగతం పలికారు. అయుత చండీయాగం ఎంతగా అయితే ఆసక్తికరంగా మారిందో.. ఈ బావా బావమరుదుల వ్యవహారం కూడా అంతే ఆసక్తికరంగా మారింది.