Begin typing your search above and press return to search.
ఆ బాధ్యత కేటీఆర్ కా? హరీష్ కా?
By: Tupaki Desk | 24 Sep 2019 8:05 AM GMTహుజూర్ నగర్ ఉప ఎన్నికకు వేళయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీచేసి రాజీనామా చేసిన ఈ సీటును కొడితే కాంగ్రెస్ కుంభస్థలంపై కొట్టినట్టేనని గులాబీ బాస్ కేసీఆర్ స్కెచ్ గీస్తున్నారు. హుజూర్ నగర్ ను ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ ఎస్ లో ఖాతాలో వేసి ఉత్తమ్ కు - కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడు..
ఇప్పటికే హుజూర్ నగర్ టీఆర్ ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి ని ప్రకటించారు కేసీఆర్. ఇక టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజూర్ నగర్ గెలుపు కోసం ఒక్కో మండలానికి ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పజెప్పారు. బతుకమ్మ చీరల పంపిణీని నల్గొండలోనే ప్రారంభించారు. హుజూర్ నగర్ గెలుపు బాధ్యతలను ప్రస్తుతానికి టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆరే తీసుకున్నారు.
అయితే బలమైన ఉత్తమ్ నియోజకవర్గంలో కేటీఆర్ బలం సరిపోతుందా.? కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గంలో టీఆర్ ఎస్ ను కేటీఆర్ గెలిపిస్తాడా అన్నది అనుమానంగా మారింది. ఇది వరకు టీఆర్ ఎస్ లో ప్రతీ ఎన్నికను గెలిపించి ట్రబుల్ షూటర్ గా హరీష్ సత్తా చాటాడు. ఇప్పుడు హుజూర్ నగర్ వైపు మాత్రం హరీష్ పోవడం లేదు. కేసీఆర్ కనుక ఆదేశిస్తే అల్లుడు హరీష్ సత్తా చాటడం ఖాయం..
ఓ వైపు కేటీఆర్ - మరో వైపు హరీష్ కనుక హుజూర్ నగర్ లో ప్రచారం చేస్తే గులాబీ గెలుపు ఖాయం అని టీఆర్ ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి హరీష్ ను ఈ ప్రచారానికి కేసీఆర్ - కేటీఆర్ లు ఆహ్వానిస్తారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.