Begin typing your search above and press return to search.

హరీశ్ లో లేనిది.. కేటీఆర్ లో ఉన్నదేంది? 1

By:  Tupaki Desk   |   17 Feb 2016 6:00 AM GMT
హరీశ్ లో లేనిది.. కేటీఆర్ లో ఉన్నదేంది? 1
X
ఇరువురు నేతలు. వారిద్దరూ వరుసకు బావా.. బావమరుదులు. వయసులోనూ పెద్ద వ్యత్యాసం లేనోళ్లే. అలాంటి ఇద్దరి నేతల మధ్య వైరుధ్యాలు ఉంటాయా? అని ప్రశ్నిస్తే.. పగలు.. రాత్రి అంత తేడా ఉంటుందని చెబుతుంటారు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్.. కేటీఆర్ లు ఉద్దేశించే. టీఆర్ ఎస్ కు అన్నీ తానైన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రెండు కళ్లుగా ఉండే ఈ ఇద్దరి నేతల వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది. మొన్న గ్రేటర్ ఎన్నికల్ని అన్నీ తానై వ్యవహరించి.. వ్యక్తిగత విషయంగా తీసుకొన్న కేటీఆర్.. అనుకున్నట్లే అదరిపోయే విజయాన్ని పార్టీకి అందించారు.

తాజాగా మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ ఉప ఎన్నికల్ని మంత్రి హరీశ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటమే కాదు.. తానొక్కడే ఓ శక్తిగా మారి.. మరొకరి అవసరం లేకుండా అన్నీ తానై వ్యవహరించారు. ఈ ఎన్నిక బాధ్యతను భుజానికి ఎత్తుకున్న రోజు నుంచి 50వేల మెజార్టీ పక్కా అని మాటల్లో చెప్పటమే కాదు.. చేతల్లో చేసి చూపించి.. తన సత్తా ఏంటన్నది మరోసారి రుజువు చేశారు.

ఇలా ఇరువురు నేతలు తమకు అప్పగించిన సవాళ్లను విజయవంతంగా పూర్తి చేయటం బాగానే ఉన్నా.. గ్రేటర్ ఎన్నికల ఫలితం సందర్భంగా కేటీఆర్ కు వచ్చిన మైలేజ్ తో పోల్చినప్పుడు.. తాజా ఖేడ్ ఫలితం సందర్భంగా హరీశ్ కు అంత ఇమేజ్ ఎందుకు రాలేదన్నది పెద్ద ప్రశ్న. ఈ ఇద్దరికి సంబంధించి పలువురికి వచ్చే సందేహాల్లో కీలకమైన ఒక ప్రశ్న.. కేటీఆర్ లో ఉన్నదేంది? హరీశ్ లో లేనిదేంది? అన్నది. మరి.. దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేసినప్పుడు ఆసక్తికరమైన అంశాలు చాలానే బయటకు వస్తాయి.

ఇందులో మొదట హరీశ్ రావును సంగతి చూస్తే.. టీఆర్ ఎస్ ట్రబుల్ షూటర్ గా ఆయనకు పేరుంది. పార్టీకి సంబంధించి ఆయన చేసే పనులు చాలావరకూ సాధారణ జనాలకు పెద్దగా తెలీవు. వెలుగులోకి కూడా రావు. అందుకే.. ఆయన్ను వీరోచిత కథానాయకుడిగా వర్ణించే వారు తక్కువే. దీనికి హరీశ్ కూడా కారణమే చెప్పాలి.