Begin typing your search above and press return to search.

కేటీఆర్ హరీష్.. ఎంత తేడా..?

By:  Tupaki Desk   |   7 Jan 2020 4:22 AM GMT
కేటీఆర్ హరీష్.. ఎంత తేడా..?
X
ఎంత తేడా.. వాళ్లిద్దరూ సీఎం కొడుకు.. సీఎం అల్లుడులే.. కాబోయే తెలంగాణ సీఎం ఓ వైపు.. కాబోయే పల్లకీ మోసే నేత.. ఇలా కేటీఆర్ - హరీష్ ఒకే తాను ముక్కలైనా గౌరవంలో మర్యాదలో.. అందలంలో.. అవమానంలో ఎంత తేడా.. తిరుమల సాక్షిగా సీఎం కుమారుడు.. భావి సీఎం కేటీఆర్ కు అందలం దక్కింది. తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శించుకునేందుకు రాగా బ్రహ్మరథం పట్టారు. అదే సమయంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కోరిన టికెట్లు కూడా ఇవ్వకుండా అవమానించినట్టు వార్తలు వచ్చాయి..

కేవలం తిరుమలలోనే కాదు.. ఇప్పుడు తెలంగాణలోనూ కేటీఆర్ కు ప్రధాన పోటీదారు.. చెప్పాలంటే కేటీఆర్ కంటే కూడా ఎక్కువ శక్తి సామర్థ్యాలున్న హరీష్ రావును కావాలనే పక్కనపెడుతున్నారన్న చర్చ సాగుతోంది.

మంత్రి వర్గ విస్తరణలో దూరం పెట్టడం.. ఎన్నికల బాధ్యతలకు హరీష్ దూరం చేయడం.. ప్రభుత్వంలో.. పార్టీలో కేటీఆర్ కు ఏకచ్ఛత్రాధిపత్యం అప్పజెప్పడం చూశాక.. తెలంగాణలో ఒకప్పుడు ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావుకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. ఆర్థికమంత్రిగా హరీష్ ను ఉత్సవ విగ్రహంలా మార్చారని.. ప్రజలతో సంబంధం లేని శాఖను కేసీఆర్ తెలివిగా అప్పగించారన్న చర్చ సాగుతోంది.

కొడుకు కేటీఆర్ కు పోటీ ఉండకూడదని.. అసమ్మతికి తావు ఇవ్వకూడదని భావించి హరీష్ రావును గులాబీ బాస్ తోపాటు పార్టీ - పక్కరాష్ట్రంలో కూడా పక్కనపెడుతున్న తీరుపై హరీష్ రావు అభిమానులైతే కలత చెందుతున్నారు. కేటీఆర్ కు అందలం దక్కడంలో తప్పులేకున్నా.. ఆయనతో సరిసమానమైన హరీష్ రావును పట్టించుకోకపోవడమే ఇప్పుడు ఆయన అభిమానులను కలిచివేస్తోంది.