Begin typing your search above and press return to search.
కవితకు చీర.. కేటీఆర్ కు హెల్మెట్
By: Tupaki Desk | 7 Aug 2017 6:20 AM GMTదేశ వ్యాప్తంగా జరుగుతున్న రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ కు ఆయన సోదరి.. ఎంపీ కవిత రాఖీ కట్టారు. రాఖీ కట్టిన సోదరి కవితకు చేనేత చీరను బహుకరించారు కేటీఆర్.
అదే సమయంలో సోదరుడు కేటీఆర్ కు సోదరి కవిత.. హెల్మెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వీరిద్దరూ ఎవరికి వారుగా రెండు సామాజిక అంశాల మీద వేర్వేరుగా పని చేస్తున్నారు. రోడ్డు భద్రత మీద ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్న ఎంపీ కవిత.. రాఖీ సందర్భంగా సోదరులకు హెల్మెట్ ను బహుకరించాలని కోరుతున్నారు.
ఇటీవల పెరిగిన రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రాఖీ సందర్భంగా రక్షా బంధనం కట్టటంతో పాటు.. హెల్మెట్‌ను కూడా బహుమతిగా ఇచ్చి.. వాహనాన్ని నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుతూ బహుమతిగా ఇవ్వాలన్న పిలుపుతో ప్రచారం చేస్తున్నారు. తాను మాటలు మాత్రమే కాదు చేతలు కూడా అన్నట్లు.. బైక్ నడిపే వీలు లేనప్పటికీ మంత్రి కేటీఆర్ కు హెల్మెట్‌ను బహుకరించారు కవిత.
అదే సమయంలో చేనేత రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు వీలుగా చేనేత వస్త్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే ఈ రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ సినీ నటి సమంతను నియమించారు. చేనేత వస్త్రాలకు తాను చేస్తున్న ప్రచారానికి తగ్గట్లే.. రాఖీ పండక్కి తన సోదరి కవితకు చేనేత చీరను బహుమతిగా అందించటం విశేషం. రాఖీ పండగ సందర్భంగా తాము చేసే సామాజిక అంశాలు ప్రతిబింబించేలా కేటీఆర్.. కవితలు వ్యవహరించటం గమనార్హం.