Begin typing your search above and press return to search.
నితీశ్ పై కేసీఆర్ కుటుంబం ప్రశంసలు
By: Tupaki Desk | 8 Nov 2015 9:46 AM GMTబీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఓటమిపాలు కావడం ఆసక్తికర రాజకీయాలకు శ్రీకారం చుడుతోంది. ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించి అధికారి ప్రకటన కోసం వేచిచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహాకూటమి నేతలు నితీష్ కుమార్ - లాలుప్రసాద్ యాదవ్ కు అభినందనలు తెలిపారు. మంచి పాలన అందించినందుకే మరోమారు ప్రజలు నితీష్ కు పట్టం కట్టారని ఆయన అన్నారు.
మరోవైపు కేసీఆర్ కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ - ఎంపీ కవిత సైతం ఈ గెలుపుపై స్పందించారు. బీహార్ లో అభివృద్ధికి పట్టం కట్టారని కేసీఆర్ తనయుడు - తెలంగాణమంత్రి కేటీఆర్ అన్నారు. లక్షకోట్ల ప్యాకేజీ ప్రకటించినా మోడీని బీహారీలు విశ్వసించలేదని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ లో నితీశ్ విజయం వెనుక స్థానిక అంశాలు కూడా ప్రభావం చూపాయని కేటీఆర్ విశ్లేషించారు. కేసీఆర్ కుమార్తె - నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం నితీశ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్రమోడీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, ప్రధానమంత్రి హోదాలో ప్రస్తుతం చేస్తున్న పనులకు పొంతనలేదని ఆమె అన్నారు. ఓట్ల కోసమే మోడీ ప్యాకేజీ ఇచ్చారని బీహార్ ప్రజలు గుర్తించారని కవిత వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రులు అయిన నితీశ్ కుమార్ - లాలూప్రసాద్ యాదవ్ లు సమన్వయంతో బీహార్ లో విజయం సాధించారని అన్నారు.
బీహార్ లో ఎన్డీఏ ఓటమి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓటమిగా విశ్లేషకులు భావిస్తుండగా...కేసీఆర్ కుటుంబ సభ్యులు మూకుమ్మడి నితీశ్ ను అభినందించడం ఆసక్తికరంగా మారింది.