Begin typing your search above and press return to search.
పని చేసేదంతా మీరున్నంత సేపే కేటీఆర్..
By: Tupaki Desk | 27 Sep 2016 9:25 AM GMTప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? అంటే.. అధికారుల చేసే పనికి తగ్గట్లే ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతలు వస్తుంటాయి. అధినేత ఎంత నిక్కచ్చిగా ఉన్నా.. అధికార గణం కానీ పని చేయకుంటే అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తికాదు. తెలంగాణలో ప్రస్తుతం చిత్రమైన పరిస్థితి నెలకొంది. డైనమిక్ సీఎంగా కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుంటే.. అందుకు తగ్గట్లుగా అధికారులు డైనమిక్ గా వ్యవహరించటం లేదన్న వాదన వినిపిస్తోంది. అధికారులు తూతూ మంత్రంగా పనులు చేస్తున్నారే తప్పించి.. ముఖ్యమంత్రి ఆశిస్తున్న కమిట్ మెంట్ వారిలో చాలా తక్కువ మందిలో కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్లే కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
హైదరాబాద్ రోడ్ల పరిస్థితి మీద ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో ప్రస్తావించారు కూడా. అయినా.. ఇప్పటికి హైదరాబాద్ రోడ్ల పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ అతలాకుతలమైంది. దీంతో మహానగరంలోని లక్షలాది మంది తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన మంత్రి కేటీఆర్ పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. చేపట్టాల్సిన చర్యల్ని స్పష్టగా పేర్కొంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పనులు జరిగిన తీరుపై పెదవి విరిచే పరిస్థితి.
అధికారుల తీరు ఎలా ఉందనటానికి ఇటీవల జరిగిన ఒక ఉదంతాన్ని ప్రస్తావించటం సమంజసంగా ఉంటుంది. మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్ రైల్వే గేటు వద్ద ఉన్న మొయిన్ రోడ్డు దుస్థితిని చూసి తీవ్రంగా స్పందించారు. అధికారుల్ని నిలదీశారు. సీరియస్ అయ్యారు. మొయిన్ రోడ్ ఇలా ఉండటం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేయటంతో అక్కడి రోడ్డు మీద పడిన గుంతల్ని పూడ్చేందుకు అధికారులు నానా హైరానా పడ్డారు. కాసేపు అక్కడే ఉండి.. పని మొదలైన తర్వాత ఆ పనిని పూర్తి చేయాలని చెప్పి కేటీఆర్ వెళ్లిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మంత్రి కేటీఆర్ అలా వెళ్లిన కాసేపటికే చేస్తున్న పనిని వదిలేసి అధికారులు కూడా వెళ్లిపోయారు. దీంతో.. గుంతల రోడ్లు కొద్దిమేర మాత్రమే కవర్ అయి.. మిగిలిన రోడ్డు మొత్తం గుంతలుగా ఉండిపోయిన దుస్థితి. ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్న వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. మంత్రి కేటీఆర్ లు కానీ ఎంత తపిస్తే మాత్రం ప్రయోజనం ఏం ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. పనులు పరుగులు పెట్టాలని తపిస్తున్న వీరిద్దరూ వాస్తవ పరిస్థితిని గుర్తించి తగిన మందు వేస్తే తప్పించి సిస్టం సెట్ కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/