Begin typing your search above and press return to search.
కేసీఆర్, కేటీఆర్ శాఖల్లోనే కంపు!!
By: Tupaki Desk | 10 July 2015 3:30 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు నిర్వహిస్తున్న మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు కంపు కొడుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ శాఖల్లో ఇంత కంపు గతంలో ఎన్నడూ చూడలేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కారణం.. ఆ రెండు శాఖల ఉద్యోగులూ సమ్మె చేస్తుండడమే!
తెలంగాణలో మున్సిపల్ ఉద్యోగులు గత పది రోజులుగా, పంచాయతీ రాజ్ ఉద్యోగులు గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. రెవెన్యూ ఉద్యోగులు సమ్మెకు పిలుపు ఇచ్చిన వెంటనే దానికి బాధ్యుడు అయిన సీసీఎల్‌ఏ, సీఎస్ రాజీవ్ శర్మ వెంటనే రంగంలోకి దిగారు. నేరుగా రెవెన్యూ సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. వారి డిమాండ్లను అంగీకరించారు. సమస్యను పరిష్కరించారు. కానీ, అదే తరహాలో మున్సిపల్ శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి తన శాఖ సిబ్బంది సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్వచ్ఛ తెలంగాణకు, స్వచ్ఛ హైదరాబాద్‌కు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి పది రోజులుగా తన శాఖ సిబ్బంది సమ్మె చేస్తున్నా.. నగరాలు, పట్టణాలు, గ్రామాలన్నీ ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తతో కంపు కొడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేస్తున్నాయి.
ఇక, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తన శాఖ సిబ్బందితో గతంలో చర్చలు జరిపారని, అప్పుడు హామీలు ఇచ్చారని వాటిని ఆమోదించలేదని,దాంతో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని అయినా ఆయన పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో మళ్లీ సమ్మెకు దిగడం కూడా ఇదే తొలిసారి అవుతుందేమోనని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంమీద తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ నిర్వహిస్తున్న శాఖల్లోనే కంపు రాజ్యమేలుతోందని ఎద్దేవా చేస్తున్నారు.