Begin typing your search above and press return to search.
సిరిసిల్ల షాక్ నుంచి కోలుకోని గులాబీ దళం
By: Tupaki Desk | 18 Oct 2016 8:02 AM GMTగెలుపు ఇచ్చే కిక్కే వేరు. అదే ఓటమి ఇచ్చే షాక్ అంతాఇంతా కాదు. ఓటమి గెలుపుకు తొలి అడుగు లాంటి మాటలు వినటానికి బాగానే ఉంటాయి కానీ.. అవి కాస్తా అనుభవంలోకి వస్తే ఎంత కష్టంగా ఉంటుందన్నది అనుభవించినోళ్లకే తెలుస్తుంది. తమ తప్పు లేకున్నా.. ఓటమిని అంగీకరించాల్సి రావటానికి మించిన దురదృష్టం ఇంకోటి ఉండదు. అధినాయకత్వం చేసిన తప్పులకు బాధ్యత వహిస్తూ.. నిరాశ నిస్పృహల్లోకి కూరుకుపోతున్నారు సిరిసిల్లా జిల్లా టీఆర్ ఎస్ నేతలు. కొత్త జిల్లాగా సిరిసిల్లను ఏర్పాటు చేయటం.. మంత్రి కేటీఆర్ కు అడ్డా అయిన ఈ జిల్లాలో గులాబీ దళం ఇంతలా ఆవేదన చెందటం ఏమిటన్న ఆశ్చర్యం అక్కర్లేదు. అధినాయకత్వం ఆడిన ఆటతో గులాబీ దళం ఇప్పుడు తీవ్ర మనోవేదనతో కిందామీదా పడుతున్న పరిస్థితి.
ఇలాంటి వేళ.. అనుచరగణంలో ఉత్సాహాన్ని నింపేందుకు అండగా ఉండాల్సిన మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలకు వెళ్లటం గులాబీ నేతలకు మరింత ఇబ్బందికరంగా మారింది. కొత్త జిల్లాను సాధించిన సంతోషం వారి ముఖాల్లో మచ్చుకు లేక.. రోజురోజుకీ వారు పడుతున్న వేదన పెరుగుతుందే తప్పించి తగ్గని దుస్థితి. ఎందుకిలా ఉంటే.. దానికి చాలానే కారణాలు ఉన్నాయని చెప్పక తప్పదు.
సాధారణంగా ఏ పని చేసినా.. దాని క్రెడిట్ గంప గుత్తగా తన అకౌంట్లో పడేలా జాగ్రత్త తీసుకోవటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. కింద పడినా పైచేయి తనదే అన్నట్లుగా వ్యవహరించే ఆయన.. తాజాగా చేసిన పొరపాట్లకు సిరిసిల్ల జిల్లా అధికారపక్ష నేతలు వేదనను అనుభవిస్తున్నారు. ఎవరూ కోరుకోకుండానే సిరిసిల్ల జిల్లాను ముఖ్యమంత్రి ప్రకటించటంతో ఆ జిల్లాలోని అధికారపక్ష నేతలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లా సాధన క్రెడిట్ మొత్తాన్ని తమ అధినేత కుమారుడు కేటీఆర్ ఖాతాలో వేసిన వారంతా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితుల్లో జిల్లా ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించటంతో ఒక్కసారి షాక్ తిన్నపరిస్థితి.
అనుకోకుండా వచ్చిన జిల్లా వెనక్కి వెళ్లిపోవటంపై సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న విపక్షాలు ఏకమై పోరాటం మొదలు పెట్టాయి. వీరికి దన్నుగా పలు జేఏసీలు ఉద్యమ గోదాలోకి దిగి.. నిరసనలు.. ఆందోళనలు నిర్వహించారు. దీంతో డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ నేతలు యుద్ధప్రాతిపదికన కేటీఆర్ ను కలిసి.. జిల్లాను వెనక్కి తీసుకోవటం వల్ల కలిగే నష్టాల్ని ఏకరువు పెట్టారు. జిల్లా ప్రకటించకున్నా బాగుండేది కానీ.. ప్రకటించిన తర్వాత వెనక్కి తీసుకోవటం వల్ల జరిగే నష్టం భారీగా ఉంటుందని నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై అధినేతతో మాట్లాడతానని చెప్పిన కేటీఆర్.. ఆ తర్వాత కామ్ అయిపోయారు.
జిల్లా ఏర్పాటు విషయంపై తన వద్దకు వచ్చిన వారితో.. ఆ విషయాన్ని వదిలిపెట్టాలని.. ప్రభుత్వ పరిస్థితి అర్థం చేసుకోవాలంటూ సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో.. టీఆర్ ఎస్ నేతలకు ఏమీ పాలుపోని పరిస్థితి. మరోవైపు.. ముందుగా ప్రకటించినట్లే జిల్లాను ప్రకటించాలని కోరుతూ మొదలైన ఆందోళనలకు రోజురోజుకీ ప్రజాదరణ పెరిగిన వేళ.. కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి సిరిసిల్ల ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలని.. సాంకేతికంగా జిల్లా ఏర్పాటు సాధ్యం కాకపోవటాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
అయితే.. కేటీఆర్ లేఖకు సానుకూల స్పందన కంటే కూడా ప్రతికూలతే ఎక్కువైంది. ఎవరూ అడగకుండానే జిల్లాను ప్రకటించి.. కొత్త ఆశల్ని రేపి.. ఇప్పుడు జిల్లాను వెనక్కి తీసుకోవటం కుదరదంటే కుదరదన్న విషయాన్ని తేల్చి చెప్పటమే కాదు.. ఏది ఏమైనా జిల్లాను ఇవ్వాలనే పట్టుదలకు సిరిసిల్ల వాసులు వచ్చేశారు. జిల్లాకు చెందిన విపక్ష నేతలు సైతం ఈ విషయంలో పట్టుదలతో ఆందోళనలు చేపట్టటం.. వాటిని అడ్డుకునేందుకు పోలీసులు ఝుళిపించిన లాఠీలు విరిగిన కొద్దీ.. పోరాట స్ఫూర్తి రెట్టింపు కావటం..చివరకు జిల్లాను కానీ ప్రకటించకుంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితిని తీసుకురావటంలో విపక్షాలుసక్సెస్ అయ్యాయి.
ఇదే.. ఎవరూ ఊహించని రీతిలో ప్రభుత్వం చేత సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రకటన వచ్చేలా చేసిందని చెప్పాలి. జిల్లా అంశాన్ని వదిలిపెట్టి.. అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలంటూ తమ నాయకుడు చెప్పిన తర్వాత.. జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో జిల్లాకు చెందిన గులాబీ నేతల నోట మాట రాని పరిస్థితి. జిల్లాను ఇచ్చింది తమ ప్రభుత్వమే అయినా.. వ్యూహాత్మకంగా చోటు చేసుకున్న తప్పులతో రావాల్సిన క్రెడిట్ రాకుండా పోవటం.. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు విజయాన్ని విపక్షాలు తమ ఖాతాలోకి తీసుకోవటం గులాబీ దళాన్ని రగిలిపోయేలా చేస్తోంది. అందుకే అందరూ సంబరాలు చేసునే వేళ.. టీఆర్ఎస్ నేతల ముఖాలు మాత్రం దిగాలుగా ఉండటం వెనుక అసలు కారణం ఇదేనన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/