Begin typing your search above and press return to search.
సార్ అనొద్దు - బ్రదర్ అని పిలవన్నా - పవన్ కి కేటీఆర్ ట్వీట్
By: Tupaki Desk | 26 March 2020 3:48 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ - తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మధ్య ట్విట్టర్ లో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. వీరిద్దరి ఆత్మీయ సంభాషణకు ఒకరి అభిమానులు మరొకరికి ఫిదా అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని మోడీ దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ హాస్టల్స్ లోని విద్యార్థులను - ఉద్యోగులను యాజమాన్యాలు ఖాళీ చేయించాయి. వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంలో కేటీఆర్ జోక్యం చేసుకొని ధైర్యం చెప్పారు.
ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా గురువారం సాయంత్రం స్పందించారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలో మీరు చేసిన ప్రశంసనీయపనికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా థ్యాంక్యూ కేటీఆర్ సర్ అని పేర్కొన్నారు.
జనసేనాని తనను సర్ అని పిలవడంపై కేటీఆర్ స్పందించారు. తనను ప్రశంసించినందుకు గాను తొలుత ధన్యావాదాలు చెప్పారు తెలంగాణ మంత్రి. ఆ తర్వాత ట్వీట్ ను కొనసాగిస్తూ.. మీరు నన్ను సర్ అని పిలవడం ఎప్పటి నుండి మొదలు పెట్టారు.. ఎప్పుడూ సోదరుడినే అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా వెంటనే స్పందిస్తూ.. యస్ బ్రదర్ అని మరో ట్వీట్ చేశారు. ఐతే ఇదంతా వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం తో ఆత్మీయంగా మాత్రమే సాగింది. కేటీఆర్ ట్వీట్ చూసి జనసేనాని అభిమానులు ముచ్చటపడ్డారు. పవన్ ఫ్యాన్స్ మనసులను కేటీఆర్ గెలుచుకున్నారు. పవన్ స్పందన చూసిన యువనేత అభిమానులు అంతే సంతోషించారు.