Begin typing your search above and press return to search.

పవన్‌ ఒక ఎనిగ్మా - ఎన్టీఆర్ ఒక ఫెర్మార్మ‌ర్‌: కేటీఆర్

By:  Tupaki Desk   |   29 Dec 2017 4:07 AM GMT
పవన్‌ ఒక ఎనిగ్మా - ఎన్టీఆర్ ఒక ఫెర్మార్మ‌ర్‌: కేటీఆర్
X
ఇమేజ్ ను పెంచుకోవ‌టానికి చాలామంది చాలా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. స్మార్ట్ గా ఇమేజ్ ను పెంచుకోవ‌టంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. నేటి త‌రం నేత‌గా ఆయ‌న దూసుకెళుతున్నారు. గురువారం రాత్రి రెండు గంట‌ల‌కు పైగా నెటిజ‌న్ల‌కు అందుబాటులో ఉన్న కేటీఆర్‌.. అస్క్ కేటీఆర్‌# పేరుతో ప‌లువురు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాల్ని ఇచ్చారు.

రాజ‌కీయ అంశాల‌తో పాటు.. ప్ర‌భుత్వ‌.. పాల‌నతో పాటు వివిధ రంగాల‌కు చెందిన అంశాల‌పై త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు సునిశిత ప‌రిశీల‌న త‌న‌కున్న విష‌యాన్ని చాటుకున్నారు. ఈ లైవ్ లో తండ్రిపైనా.. బావ హ‌రీశ్ పైనా ప్ర‌శంస‌లు కురిపించిన కేటీఆర్‌.. కొన్ని సంద‌ర్భాల్లో ఇబ్బందిక‌ర ప్ర‌శ్న‌ల‌కు తెలివిగా స‌మాధానాలు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

కేటీఆర్ ఇచ్చిన స‌మాధానాల్లో ఆస‌క్తిక‌ర‌మైన‌వి చూస్తే..

+ సానుకూల ప‌లితాలు సాధించే టాస్క్ మాస్ట‌ర్ సీఎం కేసీఆర్‌

+ కేసీఆర్ కాకుండా అయితే అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాను ఇష్ట‌ప‌డ‌తా

+ మంత్రి హ‌రీశ్ మొండి ప‌ట్టుద‌ల ఉన్న వ్య‌క్తి. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే నాయ‌కుడు

+ కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే.. ఆయ‌న ఎవ‌రు? అని వ్యాఖ్యానించారు.

+ కాంగ్రెస్ అభివృద్ధికి నిరోధ‌క‌మంటారు.. మ‌రి మీ నాన్న‌గారు కాంగ్రెస్ లో ఒక‌ప్పుడు ప‌ని చేశారుగా? అంటే.. అంద‌రూ త‌ప్పులు చేస్తార‌ని.. తెలివైన వారు వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటారని బ‌దులిచ్చారు.

+ సోనియానా.. మోడీనా అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా దేశంలో రెండు పార్టీల వ్య‌వ‌స్థ మాత్ర‌మే లేద‌న్న స‌మాధానంతో ఇరువురికి తాము స‌మాన దూర‌మ‌న్న విష‌యాన్ని చెప్పేశారు

+ చ‌దువుకున్న వారు రాజ‌కీయాల్లోకి రావ‌టం లేదేం? అంటే.. ప్ర‌భుత్వం.. ప్ర‌జ‌లు వేర్వేరు అనే భావ‌న ఉంది. నిజానికి అవి రెండూ క‌లిస్తేనే ప్ర‌జాస్వామ్యం.

+ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం మీదేనంటూ ఏపీకి చెందిన వ్య‌క్తి చేసిన ట్వీట్‌కు.. ఎన్నిక‌ల‌పై చింత లేద‌ని.. దృష్టంతా పాల‌న‌పైనే అని వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీని విస్త‌రించే ఆలోచ‌న‌లేవీ త‌న‌కు తెలీదంటూ.. ఏపీని సిస్ట‌ర్ స్టేట్ గా అభివ‌ర్ణించ‌టం గ‌మ‌నార్హం.

+ ఏపీలో టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్‌.. జ‌న‌సేన పార్టీల్లో ఏ పార్టీకి ఓటేస్తార‌ని అడ‌గ్గా.. త‌న‌కు ఏపీలో ఓటు లేద‌న్నారు.

+ వ‌న్ ప్ల‌స్ వ‌న్ ఎంత‌న్న ప్ర‌శ్న‌కు.. రాజ‌కీయాల్లో ఒక‌టికి ఒక‌టి రెండు ఎన్న‌టికి కాద‌న్నారు.

+ ఢిల్లీ ప్ర‌భుత్వంలో చేర‌తారా? అన్న ప్ర‌శ్న‌కు.. ఢిల్లీలో రెండు ప్ర‌భుత్వాలు ఉన్నాయా? అంటూ ప్ర‌శ్నించారు.

+ సినిమా వారి గురించి కేటీఆర్ రియాక్ట్ అవుతూ..

అల్లుఅర్జున్ - స్టైలిష్‌

మ‌హేశ్ బాబు - సూప‌ర్ స్టార్‌

ప్ర‌భాస్ - బాహుబ‌లి

జూనియ‌ర్ ఎన్టీఆర్ - ఒక ఫెర్మార్మ‌ర్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ - ఎనిగ్మా (అర్థం చేసుకోవ‌టానికి క‌ష్ట‌మైన వ్య‌క్తి)

+ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ జీవితాన్ని ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు

+ బాలీవుడ్ షారుఖ్ ఖాన్ అభిమాన న‌టుడు

+ అప్ప‌ట్లో రాహుల్ ద్రావిడ్‌.. ఇప్పుడు కోహ్లీ.. రోహిత్ ఇష్ట‌మైన క్రికెట్ తారలు

+ స‌చిన్ - లెజెండ్‌

+ ఇండియ‌న్‌.. చైనీస్ ఫుడ్ చాలా ఇష్టం

+ ఫిట్ గా ఉండ‌ట‌మే కొత్త సంవ‌త్స‌రం రిజ‌ల్యూష‌న్‌

+ మెట్రో.. జీఈఎస్ ఒకే రోజు జ‌ర‌గ‌టం ఈ ఏడాది గుర్తుండిపోయే రోజు

+ జీఈఎష్‌ లో జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా నెర్వ‌స్ గా ఫీల‌య్యా

+ కొత్త సంవ‌త్స‌రం వేడుకుల‌కు డీజే అనుమ‌తి ఇప్పించరా? అంటే.. నీకో దండం బాబూ అనేశారు

+ ర‌క్ష‌ణ రంగం అధీనంలోని భూసేక‌ర‌ణ క‌ష్టం కావ‌టం వ‌ల్లే స్కైవేల నిర్మాణం లేట్‌

+ పాత‌బ‌స్తీకి క‌చ్ఛితంగా మెట్రో వ‌స్తుంది

+ డీజిల్‌.. సీఎన్జీ.. ఎల్పీజీ బ‌స్సులు కాదు.. ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాలే స‌రైన ప‌రిష్కారం

+ హైద‌రాబాద్ లో వైఫై ప్రాజెక్టు పూర్తి కావొస్తోంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని హాట్ స్పాట్లు

+ అమెరికాలో ఉన్న‌ప్పుడు వంట కూడా చేశా

+ మ‌ణికొండ రోడ్డును బాగు చేయాల‌ని సినీన‌టుడు వెన్నెల కిషోర్ ప్ర‌శ్న‌కు ష్యూర్‌.. త‌ప్ప‌కుండా అని బదులిచ్చారు

+ నాకెప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అడ‌గ్గా.. త్వ‌ర‌లోనే అని బదులిచ్చారు.