Begin typing your search above and press return to search.

సామాన్యుడికి క్ష‌మాప‌ణలు చెప్పిన కేటీఆర్‌... !

By:  Tupaki Desk   |   12 April 2018 10:27 AM GMT
సామాన్యుడికి క్ష‌మాప‌ణలు చెప్పిన కేటీఆర్‌... !
X
ప‌శ్చాత్తాపానికి మించిన ప్రాయ‌శ్చితం లేదంటుంది పురాణం. ఎవ‌రైనా మ‌నిషే... అంద‌రమూ స‌మాన‌మే అంటుంది కార్పొరేట్ క‌ల్చ‌ర్‌. ముందు ప్ర‌తిఒక్క‌డూ మ‌నిషి... ఆ త‌ర్వాతే హోదాలు అంటుంది స‌మాజం. ఇవ‌న్నీ ఎందుక‌నా... ఎలా చూసినా కేటీఆర్‌ ను అభినందించాల్సిందే. త‌ప్పును ఒప్పుకునే వాడు నిజ‌మైన పాల‌కుడు అనిపించుకుంటాడు. ఈరోజు కేటీఆర్ త‌న త‌ప్పును మ‌న‌స్ఫూర్తిగా ఒప్పుకున్నాడు.

ఇటీవల హైదరాబాద్ లోని దమ్మాయిగూడలో ఒక రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. జితేందర్ సురానా అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఇందులో విశేషం ఏమీ లేదు. ప్ర‌మాదం జ‌రిగిన కొద్ది సేప‌టికే ఆ ప్రాంతం మీదుగా కేటీఆర్ కాన్వాయ్ వెళ్లింది. ఇక ఏం జ‌రిగి ఉంటుందో ఆలోచించుకోండి. పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ ఆపేశారు. దీంతో ర‌క్తం కారుతున్న గాయాల‌తో బాధితుడిని ఆస్ప‌త్రికి చేర్చ‌డం ఆల‌స్య‌మైంది. కేటీఆర్ కోసం ఆపిన ట్రాఫిక్‌ లో బాధితుడు ఇరుక్కుపోయి విలవిల్లాడాడు. ఈ విష‌యాన్ని డ్యూటీలో ఉన్న పోలీసుల‌కు చేర‌వేసినా పోలీసులు క‌నిక‌రించ‌లేదు. ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌కు కేటీఆర్ వెళ్లిపోయే దాకా ఆపి అంద‌రితో పాటు బాధితుడి ఆంబులెన్స్ ను కూడా వ‌దిలిపెట్టారు.

ఈ విష‌యంపై ప్ర‌ముఖ దిన‌పత్రిక ఒక క‌థ‌నం రాసింది. 20 నిమిషాల పాటు బాధతో ట్రాఫిక్ లో ఇరుక్కున్న ప్ర‌మాద బాధితుడు అన్న ఆ వార్త‌ను ఒక నెటిజ‌న్ కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. *కేటీఆర్ ఇది నిజ‌మైతే నేను మిమ్మ‌ల్ని హ‌ర్షించ‌ను* అని ఆ క్లిప్పింగ్ తో పాటు ట్వీట్ పెట్టాడు. దానిపై కేటీఆర్ స్పందించారు.

కేటీఆర్ ట్వీట్‌ లో ఏం చెప్పారంటే... #ఈ విషయం నిజం కాదేమోన‌ని అనుకుంటున్నానని - ఎందుకంటే తన పని తీరు అలా ఎన్నడూ ఉండదు. ఒక వేళ నా వ‌ల్ల క‌నుక అలా జ‌రిగి ఉంటే... బాధితుడికి మ‌న‌స్ఫూర్తిగా క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను* అని సారీ చెబుతూ డీజీపీకి కూడా ట్యాగ్ చేసి... ఇలాంటివి ఇక ముందు ఎట్టి ప‌రిస్థితుతుల్లోనూ జ‌ర‌గ‌కుండా పోలీసు అధికారుల‌ను - సిబ్బందిని ఆదేశించ‌మ‌ని కేటీఆర్ డీజీపీని కోరారు.

నేత‌లు త‌ప్పులు చేయ‌డం కామ‌నే గానీ... వాటిని తెలుసుకుని స‌రిదిద్దుకోవ‌డం - పున‌రావృతం కాకుండా ఉండడానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం అభినంద‌నీయ‌మే.