Begin typing your search above and press return to search.

కేసీఆర్ బ‌ర్త్ డే విషెస్ అలానే చెప్పాల‌ట‌!

By:  Tupaki Desk   |   14 Feb 2019 5:41 AM GMT
కేసీఆర్ బ‌ర్త్ డే విషెస్ అలానే చెప్పాల‌ట‌!
X
ఈ ఆదివారం తెలంగాణ‌లో పెద్ద పండ‌గే జ‌ర‌గ‌నుంది. మాకు తెలీని పండ‌గ ఏమంటారా? ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన‌రోజు. రెండోసారి అధికారంలోకి రావటం ఒక ఎత్తు అయితే.. విప‌క్షాలు సైతం వ‌ణికిపోయే మెజార్టీతో గెలుపొంద‌టంతో తెలంగాణ‌లో కేసీఆర్‌కు ఎదురే లేని ప‌రిస్థితి. ఆయ‌న్ను త‌ప్పు ప‌ట్టే వారు కానీ.. వేలెత్తే సాహ‌సం చేసే వారు లేని ప‌రిస్థితి.

ఒక‌వేళ ఉన్నా.. అలాంటోళ్ల‌ను కేసీఆర్ అస్స‌లు ప‌ట్టించుకోని ప‌రిస్థితి. ఇక‌.. సొంత పార్టీలో సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మామూలుగానే కేసీఆర్ తో మాట్లాడాలంటేనే భ‌యం. అలాంటిది ఆయ‌న‌లో త‌ప్పులు ఎత్తి చూపిస్తూ మాట్లాడే ద‌మ్ము.. ధైర్యం ఎవ‌రికి లేద‌ని చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితితోనే కావొచ్చు.. రెండు నెల‌లు గ‌డిచిన త‌ర్వాత కూడా ఒక్క‌రంటే ఒక్క మంత్రిగా ప్ర‌భుత్వ ర‌థాన్ని లాగుతున్నారు కేసీఆర్‌.

తిరుగులేని అధికారం చేతిలో ఉన్న వేళ వ‌చ్చే పుట్టిన‌రోజును నేత‌లు ఎంత ఘ‌నంగా నిర్వ‌హిస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఇక‌.. మాజీ మంత్రి త‌ల‌సాని లాంటి ప్ర‌ముఖుల గురించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఇప్ప‌టికే ఆయ‌న కేసీఆర్ పుట్టిన రోజును భారీ ఎత్తున నిర్వ‌హించ‌టానికి ప‌లు ప్లాన్లు సిద్ధం చేయ‌ట‌మే కాదు.. ఇప్పుడా ప‌నుల్లో ఆయ‌న ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. కేసీఆర్ పుట్టిన రోజును అంత ఘ‌నంగా.. ఇంత ఘ‌నంగా చేయాల‌న్న ప్లాన్ చేసిన వారి ఆశ‌ల మీద.. ఉత్సాహం మీద నీళ్లు పోస్తూ.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. సారు పుట్టిన రోజును పుర‌స్క‌రించుకొని ప‌త్రిక‌ల్లో భారీగా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌టం.. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు.. బ్యాన‌ర్లు పెట్ట‌టం లాంటివి చేయొద్ద‌న్నారు. పూల‌దండ‌లు బ‌దులు మొక్క‌ను నాటాల‌న్న పిలుపునిచ్చారు. మ‌రి.. కేటీఆర్ మాట‌ల్ని గులాబీ ద‌ళం సీరియ‌స్ గా తీసుకుంటుందా? లేక‌.. పార్టీ నేత‌ల హ‌డావుడి ముందు కేటీఆర్ పిలుపు వినిపించ‌కుండా పోతుందా? అన్న‌ది మరో మూడు రోజుల్లో తేల‌నుంది. అప్పుడు కానీ.. కేటీఆర్ మాట‌ల‌కు గులాబీ దండు ఎంత‌లా ఫాలో అవుతుందో తెలిసిపోవ‌టం ఖాయం.