Begin typing your search above and press return to search.

అతి త్వరలో సీఎంగా కేటీఆర్ .. భారీగా పెరుగుతున్న నేతల మద్దతు

By:  Tupaki Desk   |   20 Jan 2021 10:38 AM GMT
అతి త్వరలో సీఎంగా కేటీఆర్ .. భారీగా పెరుగుతున్న నేతల మద్దతు
X
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న వార్త .. అతి త్వరలో మున్సిపల్‌శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణకు ముఖ్యమంత్రి కానున్నారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ తర్వాత ఆ స్థానం ఎవరిది అంటే ఖచ్చితంగా కేటీఆర్ దే అంటూ చాలామంది టిఆర్ ఎస్ నేతలు ఇప్పటికే పలు సందర్భాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఇప్పటికే ఓ సారి కాబోయే సీఎం కేటీఆర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేసిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ మరోసారి సీఎం పదవీకి కేటీఆర్ సమర్థుడు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌ రాజకీయ వారసుడైన కేటీఆర్‌ను సీఎం చేయాలనే డిమాండ్‌కు రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తన చర్చకు దారితీసుకున్నాయి. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల.. కేటీఆర్‌ ను సీఎం చేస్తే తప్పేంటని వ్యాఖ్యానించారు. దీంతో త్వరలోనే కేటీఆర్‌ సీఎం పీఠాన్ని అధిష్టిస్తారనే వార్తలకి బలం చేకూరింది.

నిన్న మంత్రి ఆ వ్యాఖ్యలు చేసే , నేను బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని , ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ అధ్యక్షతన జరగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని రాష్ట్రంలోని యువత కోరుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్‌కు సీఎం అయ్యేలా ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు.

మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా కేటీఆర్‌ సీఎం అయితే తప్పేముందని అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌ అన్ని పనులు చేయగలడని, సరైన సమయంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇక కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలనుందని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజి రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్న వారిలో తానూ ఒకడినని చెప్పుకొచ్చారు. మొత్తంగా కేటీఆర్ కి పార్టీ నేతల మద్దతు రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ , సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి .