Begin typing your search above and press return to search.

కేసీఆర్ పేప‌ర్లో చూడాల‌ని ఫోటో దిగిన కేటీఆర్

By:  Tupaki Desk   |   10 March 2018 7:14 AM GMT
కేసీఆర్ పేప‌ర్లో చూడాల‌ని ఫోటో దిగిన కేటీఆర్
X
నిజ‌మే. మీరు ఎలాంటి త‌ప్పు చ‌ద‌వ‌లేదు. తండ్రి కేసీఆర్ చూడాల‌ని మంత్రి కేటీఆర్ ఫోటో దిగ‌టం ఏమిటి? అన్న ఆశ్చ‌ర్య‌పోతున్నారా? దానికో బ‌ల‌మైన కార‌ణం లేక‌పోలేదు. తండ్రికి ఆనందం క‌లిగించేలా.. త‌న పాత గురుతుల్లోకి జారిపోయే అవ‌కాశాన్ని ఏ మాత్రం వ‌దులుకోలేదు స‌రిక‌దా.. త‌న తండ్రికి.. ఆయ‌న ఊరోళ్ల‌కి ఆనందం క‌లిగించే ప‌ని చేశారు మంత్రి కేటీఆర్. ఇంత‌కీ ఏం జ‌రిగింద‌న్న వివ‌రాల్లోకి వెళితే..

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ చేనేత స‌హ‌కార సంఘాన్ని సంద‌ర్శించారు. చేనేత‌.. మ‌ర‌మ‌గ్గాల ప‌రిశ్ర‌మ‌ల‌కు వేర్వేరు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేయ‌టం ద్వారా కార్మికుల‌కు చేయూత అందిస్తాంచాల‌న్న‌దే త‌మ ప్ర‌య‌త్నంగా కేటీఆర్ చెప్పారు.ఈ కార్య‌క్ర‌మం జ‌రిగే స‌మ‌యంలో అనుకోని ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది.

త‌న తండ్రి కేసీఆర్ ఊరికి చెందిన ఒక ద‌ళిత మ‌హిళ కేటీఆర్ వ‌ద్ద‌కు వ‌చ్చింది. త‌న త‌ల్లిది చింత‌మ‌డ‌క అని.. త‌మ త‌ల్లి గారి బావి.. కేసీఆర్ సారు బావి ఒక్క జాగాలోనే ఉంద‌ని.. చిన్న‌ప్పుడు వెంక‌ట్రాజ‌య్య బావిలో మోట‌కొట్టేటోళ్ల‌మ‌ని ఆమె చెప్పారు. అంతేకాదు.. కేసీఆర్ తోనే మోటబావిలో నీళ్లు తోడెటోళ్ల‌మ‌ని వివ‌రించింది.

ఆ వృద్ధురాలు చెప్పిన మాట‌ల్ని కేటీఆర్ ఆస‌క్తిగా విన‌ట‌మే కాదు.. ఆమెను మ‌రింత అప్యాయంగా ప‌లుక‌రించారు. దీనికి ఆ వృద్ధురాలు తెగ సంబ‌ర‌ప‌డిపోయింది.

అచ్చంగా నాన్న‌లానే ఇసుమంత గ‌ర్వంగా లేదు.. త‌ల్లిగారిల్లు చింత‌మ‌డ‌క అన‌గానే.. ద‌గ్గ‌రికి తీసుకొని ప‌లుక‌రించాడు.. ఆయ‌న తండ్రి మాదిరే రాజ్యం ఎలాలే అంటూ ఆ మ‌హిళ ఆశీర్వ‌దించింది. అంతేనా.. ఆమెను ద‌గ్గ‌ర‌కు పిలుస్తూ.. ఫోటో దిగుదాం.. ప్రెసోళ్లు పేప‌ర్లో వేస్తారు.. మా నాన్న చూస్తాడంటూ ఆమెతో క‌లిసి ఫోటో దిగారు కేటీఆర్. ఇప్పుడు అర్థ‌మైందా తండ్రి కోసం కేటీఆర్ ఎందుకు ఫోటో దిగారో?