Begin typing your search above and press return to search.
కేటీఆర్ బర్త్ డే స్పెషల్ సాంగ్.. అదిరిపోయిందిగా
By: Tupaki Desk | 24 July 2021 8:30 AM GMTతెలగాణ మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీ ఆర్) జూలై 24న తన పుట్టిన రోజును ఘనంగా చేసుకున్నారు. అయితే.. ఆయన పుట్టిన రోజును పురస్క రించుకుని.. అన్ని వర్గాల ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. ప్రముఖులు ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలంటూ.. శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ.. కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పేరు పేరునా.. ఆయన ప్రతి ఒక్కరికీ.. ధన్యవాదాలు తెలియజేయడం విశేషం.
అయితే.. కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. పార్టీ నేతలు.. సంబరాలు చేసుకోవడం కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. గత ఏడాది కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని యూత్ వింగ్ ఒక పాటను రూపొందించి ఆయన కు బహుమతిగా అందించిన విషయం తెలిసిందే. దీనిలో కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ.. పొగడ్తలు కురిపించిన తీరు.. మేకింగ్ ఆఫ్ వీడియో.. అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక, ఈ ఏడాది సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు, టీఆర్ ఎస్ యువ జన విభాగం నాయకుడు తలసాని సాయికిరణ్.. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి వీడియో ను రూపొందించారు.
ఈ ప్రత్యేక గీతంలో కేటీఆర్‌ను ఒకవైపు ఆకాశానికి ఎత్తేస్తూనే.. మరోవైపు టీఆర్ ఎస్ ప్రభుత్వం చేపడుతు న్న అనేక సంక్షేమ పథకాలను పేర్కొనడం గమనార్హం. పల్లవి, చరణాల్లో ప్రభుత్వంపేదలు, దళిత సామా జిక వర్గం, రైతులకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను పెద్ద ఎత్తున హైలెట్ చేశారు. అదేసమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న తీరును కూడా ప్రత్యేకంగా వివరించారు. ఇక, యూత్‌లో కేటీఆర్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను.. ఈ పాట ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. ప్రతి పదాన్నీ తెలంగాణ యాసలో తీసుకుని.. అత్యంత ఆకర్షణీయంగా దీనిని తీర్చిదిద్దిన తీరు నభూతో అన్న విధంగా సాగడం గమనార్హం.
ఇక, ఈ గీతాన్ని అభిషేక్ పిక్చర్ సారథ్యంలో రూపొందించగా.. సినిమాటోగ్రఫీ.. కొరియోగ్రఫీ వంటివి శ్యామ్ తుమ్మలపల్లి, ఆటా సందీప్‌లు నిర్వహించారు. పాటను.. హర్షవర్థన్ రామేశ్వర్ కంపోజ్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇక, అనుసుబ్బయ్య, గౌతమి అశోక్, ఆర్తి గోవిందరాజన్.. తమ గళాలతో ఈ గీతాన్ని శ్రావ్యంగా ఆలపించారు. నిజానికి ఒక రాజకీయ నేతలపై ఈ రేంజ్‌లో పాటను కూర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పటికి రాజకీయ నేతలపై చాలా పాటలే వచ్చాయి. కానీ, సూపర్ స్టార్ హీరో రేంజ్‌లో ఈ తాజా పాటను రూపొందించడం విశేషమనే చెప్పాలి. పాట మేకింగ్ సహా రచనలో తీసుకున్న జాగ్రత్తలు.. దీనిని ఓ రేంజ్‌లో నిలబెట్టాయనే చెప్పాలి.