Begin typing your search above and press return to search.

హ‌రీశ్‌ ను కేటీఆర్ ఎంత‌గా పొగిడారంటే..

By:  Tupaki Desk   |   3 Jun 2017 10:37 AM GMT
హ‌రీశ్‌ ను కేటీఆర్ ఎంత‌గా పొగిడారంటే..
X
నాయ‌కుడికి క‌లుపుకుపోయే త‌త్త్వం ఉండాలి. అవ‌న్నీ త‌న‌లో పుష్క‌లంగా ఉన్నాయ‌న్న విష‌యాన్ని పార్టీ క్యాడ‌ర్‌ కు.. ప్ర‌జ‌ల‌కు త‌ర‌చూ అర్థ‌మ‌య్యేలా చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు తెలంగాణ‌రాష్ట్ర మంత్రి కేటీఆర్. టీఆర్ ఎస్ లో కేసీఆర్ త‌ర్వాత స్థానం ఎవ‌రిద‌న్న మాట‌కు.. వ‌చ్చే స‌మాధానానికి.. పార్టీ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో జ‌రిగే మాట‌ల‌కు అస్స‌లు పోలిక ఉండ‌ద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల వ‌ర‌కూ ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌టానికి చాలానే ఇబ్బంది ప‌డేవారు. ఆ మాట‌కువ‌స్తే.. టీఆర్ ఎస్ లో రెండు వ‌ర్గాలు స్ప‌ష్టంగా క‌నిపించేవి. కానీ.. ఇప్పుడా ప‌రిస్థితి లేద‌ని చెప్పాలి. కేసీఆర్ త‌ర్వాత కేటీఆరే అన్న విష‌యాన్ని పార్టీ వ‌ర్గాల‌న్నీ ఇప్పుడు ఓకే చేసే ప‌రిస్థితి.

త‌న స‌మ‌ర్థ‌త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నిరూపించుకోవ‌టంతో పాటు.. అంద‌రిని క‌లుపుకెళ్లే ధోర‌ణిలో త‌న‌లో ఎంత ఎక్కువ‌న్న విష‌యాన్నిఆయ‌న త‌ర‌చూ చెబుతుంటారు. కేటీఆర్‌ కు.. హ‌రీశ్ ల మ‌ధ్య అధిప‌త్య‌పోరు జ‌రుగుతుంద‌న్న మాట త‌ర‌చూ వినిపించేది. ఎప్పుడైతే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయో.. అప్ప‌టి నుంచి టీఆర్ ఎస్ లో కేటీఆర్ అధిక్య‌త ఏమిట‌న్న‌ది అంద‌రికి అర్థ‌మైపోయింది.

కేసీఆర్ త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయ వార‌సుడు ఎవ‌ర‌న్న విష‌యంపై కాస్తంత క్లారిటీ వ‌చ్చేసిన త‌ర్వాత నుంచి.. కేటీఆర్ తీరు మ‌రింత మారిన‌ట్లుగా చెబుతారు. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ హ‌రీశ్‌ ను తాను క‌లుపుకెళ్లే వైనాన్ని ఆయ‌న ఎప్ప‌టికిప్పుడు అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చెబుతుండ‌టం క‌నిపిస్తుంది.

తాజాగా అలాంటి తీరును మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు కేటీఆర్. ఈ రోజు మంత్రి హ‌రీశ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్ ను ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసుకొని మంత్రి కేటీఆర్ విప‌రీతంగా పొగిడేశారు.

హ‌రీశ్‌ స‌మ‌ర్థుడైన నాయ‌కుడిగా అభివ‌ర్ణించిన కేటీఆర్‌.. స్ప‌ష్ట‌మైన భావ‌ప్ర‌క‌ట‌న‌.. క‌ష్ట‌ప‌డే త‌త్త్వం.. స‌మ‌ర్థ‌త క‌లిగిన కొంత‌మంది నాయ‌కుల్లో ఒక‌రైన హ‌రీశ్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. ఇదిలా ఉంటే.. త‌న పుట్టిన రోజును హ‌రీశ్ త‌న‌దైన శైలిలో నిర్వ‌హించారు. త‌న‌కు ప్రీతిపాత్ర‌మైన త‌న నియోజ‌క‌వ‌ర్గమైన సిద్ధిపేట‌లో క‌లియ‌దిరిగారు. ఇంటింటికి వెళ్లి.. అభిమానుల‌ను అప్యాయంగా ప‌లుక‌రించారు. ఈ సందర్భంగా హ‌రీశ్ కు బ‌ర్త్ డే విషెస్ చెప్పేందుకు పోటీప‌డ‌టం కనిపించింది. చాలామంది నేత‌లు ఇంటి ద‌గ్గ‌ర కొలువు తీరితే.. అభిమానులు వ‌చ్చి శుభాకాంక్ష‌లు చెప్ప‌టం మామూలే. కానీ.. హ‌రీశ్ మాత్రం అందుకు భిన్నంగా.. తానే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి.. త‌న సంతోషాన్ని వారితో పంచుకోవ‌ట‌మే త‌న‌కిష్ట‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం క‌నిపిస్తుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/