Begin typing your search above and press return to search.
హరీష్ కు కేటీఆర్ బర్త్ డే ట్వీట్...వైరల్!
By: Tupaki Desk | 3 Jun 2018 11:46 AM GMTతెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ తో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా కీలకమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఉద్యమం ఊపుమీదున్నపుడు హరీష్ పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. మంచి వక్తగా, రాజకీయవేత్తగా పేరున్న హరీష్ కు ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉంది. సిద్ధిపేట్ నుంచి ఎన్నికైన హరీష్....నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని పేరుంది. దీంతో, ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ ఎస్ సర్కార్ లో కేసీఆర్ మేనల్లుడైన హరీష్.... నెంబర్ టూగా వ్యవహరిస్తారని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా కేసీఆర్....కేటీఆర్, కవితలను 2009 ఎన్నికల్లో తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కేటీఆర్ ను ఎలివేట్ చేయడం ప్రారంభించారని, హరీష్ కు ప్రాధాన్యత తగ్గించారని టాక్ ఉంది. ఈ కారణంతోనే కేటీఆర్ , హరీష్ ల మధ్య గ్యాప్ ఉన్నట్లు కూడా పుకార్లు వచ్చాయి. త్వరలోనే హరీష్ వేరు కుంపటి పెట్టబోతున్నారంటూ టాక్ ఉంది. అయితే, ఈ పుకార్లకు చెక్ పెడుతూ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. నేడు హరీష్ జన్మదినం సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.
హరీష్ రావు, కేటీఆర్ ల మధ్య సత్సంబంధాలు లేవని వస్తోన్న ఊహాగానాలకు కేటీఆర్ చెక్ పెట్టారు. హరీష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ``శ్రమశీలి, సమర్థవంతమైన మంత్రి అయిన హరీష్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలను, ఆనందాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను`` అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, త్వరలోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో ఈ ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశముందని, అందుకే ఈ ఇద్దరిలో ఒకరికి రాష్ట్ర నాయకత్వ అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, వారిద్దరి మధ్య సఖ్యత ఉండేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.