Begin typing your search above and press return to search.
బావా మీరు సుదీర్ఘకాలం ప్రజాజీవితంలో ఉండాలి...హరీశ్ రావుకు కేటీఆర్ బర్త్ డే విషెస్
By: Tupaki Desk | 3 Jun 2020 7:10 AM GMTనేడు తెలంగాణ ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావు 48వ పుట్టినరోజు...ఈ సందర్భంగా టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బర్త్ డే విషెస్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా రెండు ఫొటోలను పోస్ట్ చేసిన కేటీఆర్.. తనదైన రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవనీయులైన ఆర్థిక మంత్రి, మంచి పనిమంతుడు, డైనమిక్ హరీశ్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. జీవితాంతం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. బావా.. నిత్యం ప్రజా సేవలో తరించి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాజకీయంగానైనా, ప్రభుత్వ రంగంలోనైనా నీతో కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తున్నా అని ట్వీట్ చేశారు.
గత ఏడాది కూడా కేటీఆర్ తన బావకు బర్త్ డే విషెస్ చెప్పారు. అప్పటికి హరీశ్, కేటీఆర్ ఇద్దరికీ కేసీఆర్ కేబినెట్ లో చోటు దక్కలేదు. కేటీఆర్ ను టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి హరీశ్ రావును పక్కనబెట్టారని గుసగుసలు వినిపించాయి. కానీ వాటికి చెక్ చెబుతూ హరీశ్ రావు పట్ల తనకున్న ప్రేమను కేటీఆర్ చాటుకున్నారు.తర్వాత కొన్నాళ్లకే కేసీఆర్ కేబినెట్ లో హరీశ్ కు చోటు దక్కడంతో పాటు కీలకమైన ఆర్థిక శాఖ ఆయన్ను వరించింది.
ఇకపోతే, గత ఏడాది పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్న హరీశ్ రావు.. ప్రస్తుతం వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది కూడా బర్త్ డే సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అభిమానులకు పిలుపునిచ్చారు. మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ ట్వీట్ చేశారు. నాకు బర్త్ డే విషెస్ చెప్పడానికి, నన్ను కలిసి ఆశీర్వదిస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని, అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఈ సమయంలో అందరం స్వీయ నియంత్రణ పాటించాలని, ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.