Begin typing your search above and press return to search.
లగడపాటితో తన సంచలన చాటింగ్ బయటపెట్టిన కేటీఆర్
By: Tupaki Desk | 4 Dec 2018 6:17 PM GMTఆంధ్రా ఆక్టోపస్ గా పేరొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల గురించి తాను సర్వే ఫలితాలు వెల్లడించనంటూనే...కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాకూటమికి ఆధిక్యం వచ్చే చాన్స్ ఉందని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి కేటీ రామారావు ఖండించారు. అనంతరం ఆయన సంచలన చాటింగ్ వివరాలను బయటపెట్టారు. లగడపాటి సర్వే చంద్రబాబు ఒత్తిడి ఫలితమేనని పేర్కొంటూ గత నెల ఇదే రాజగోపాల్ టిఆర్ఎస్ పార్టీ కి 65 నుంచి 70 సీట్లు వస్తాయని ఎస్ఎంఎస్ పంపినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలపడం సృష్టిస్తోంది.
లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాలను వెల్లడించిన అనంతరం మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. `లగడపాటిది సర్వే కాదు చిలక జోస్యం` అని ఆయన పేర్కొన్నారు. అయితే మరికొద్ది సేపటికి గతంలో లగడపాటికి తనకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను ఆయన పంచుకున్నారు. గత నెల 20వ తేదీన టీఆర్ఎస్ పార్టీకి 65 నుంచి 70 సీట్లు వస్తాయంటూ లగడపాటి రాజగోపాల్ తనకు పంపిన మెసేజ్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. తాము గెలిచే సీట్లను చంద్రబాబు ఒత్తిడి ఫలితంగా మార్చుకున్నారని పేర్కొంటూ కేవలం చంద్రబాబు కుట్రను ప్రజలకు తెలియజేసేందుకు లగడపాటి తనకు పంపిన మెసేజ్ ను షేర్ చేయాల్సి వస్తుందని అన్నారు. అయితే నవంబర్ 20 నాటికి పరిస్థితి ఉన్నదని, ముఖ్యమంత్రి మరియు టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ తనకు అనుకూలంగా మార్చుకునే తీరు గురించి తనకు పూర్తి అవగాహన ఉన్నదని లగడపాటి, తన అంచనాలకు మించి టీఆర్ఎస్ పార్టీ సీట్లు గెలుచుకున్న తనకు ఆశ్చర్యం లేదన్నారు. ఇదే విషయం జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ నిరూపితమైందని లగడపాటి మంత్రికి పంపిన మెసేజ్‌లో తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అసలు విషయం వెల్లడించాల్సి వస్తోందని పేర్కొంటూనే కేటీఆర్ పేల్చిన బాంబు సంచలనంగా మారింది.