Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్

By:  Tupaki Desk   |   6 May 2022 10:56 AM GMT
కాంగ్రెస్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్
X
రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు స‌హ‌జం. కొన్ని ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భాల్లో అయితే, ఈ కామెంట్ల ప‌రంప‌ర తీవ్ర స్థాయిలో ఉంటుంది. తాజాగా అదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కాంగ్రెస్ యువ‌నేత‌ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేప‌థ్యంలో టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీకవిత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కౌంటర్ అటాక్ నడుస్తోంది. అయితే, ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌రుగుతున్న కామెంట్ల‌ ప‌రంప‌ర‌లో కాంగ్రెస్ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాను కేటీఆర్ బ్లాక్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ప‌రిణామంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌రంగా స్పందించారు.

రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌పై టీఆర్ఎస్ నేత‌లు సెటైరిక‌ల్‌గా స్పందించారు. రాహుల్ గాంధీ స్టడీ టూర్ కి స్వాగతం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉత్తమ రైతు, స్నేహపూర్వక పద్ధతులను తెలుసుకొని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. అస‌లు రాహుల్‌ ఎందుకు పర్యటిస్తున్నారో చెప్పాలని కవిత ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా.. పెండింగ్ బకాలు, నిధుల గురించి కేంద్రాన్ని టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే.. కాంగ్రెస్ ఏం చేస్తుందని ట్వీట్ చేశారు. ప్రభుత్వ పథకాలు రాష్ట్రముఖచిత్రాన్ని ఎలా మార్చాయో మీ నాయకులను అడిగి తెలుసుకోండంటూ రాహుల్ కి సూచించారు.

దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, మెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. మీ పాలన పై ఏం అధ్యయనం చేయాలి అని ప్రశ్నించారు. 'రుణమాఫీ హామీ ఎలా ఎగ్గొట్టాలి?ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి? మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలాబిగించాలి? వరి, మిర్చీ,పత్తి రైతులు ఎలా చస్తున్నారు? ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్ వస్తున్నారని' రేవంత్ బదులిచ్చారు.

అయితే, ఇలా విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్న స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్ చేశారు. దీంతో కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ లో కాంగ్రెస్ నేతలు ఘాటైన ట్వీట్ చేశారు. ట్విట్టర్ పిట్ట తోకముడిచిందని.. ప్రశ్నను చూసి కేటీఆర్ గజగజ వణికిపోతున్నారని ట్వీట్ చేశారు.

ప్రజల తరఫున అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్ చేశారని మండిపడ్డారు. ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను బ్లాక్ చేయడం కేటీఆర్ మానసిక స్థితికి అద్దం పడుతుందని కాంగ్రెస్ నేతలు ట్వీట్ చేశారు.