Begin typing your search above and press return to search.
రేవంత్ ఇలాకాలో కేటీఆర్ రెండు సంచలనాలు
By: Tupaki Desk | 21 Nov 2018 5:23 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ హాట్‌గా రాజకీయాలు జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టాప్‌లో ఉండే కొడంగల్ నియోజకవర్గం మరోమారు కీలక పరిణామాలతో తెరమీదకు వచ్చింది. కొడంగల్ లో ఇవాళ సాయంత్రం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు సంచలన అంశాలు ఒకటి నియోజకవర్గం దత్తత కాగా మరొకటి రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ ను ప్రభావితం చేసేంది.
కొడంగల్ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి టీవీల్లో పోజులు కొట్టడం తప్ప.. చేసిందేమీ లేదని అన్నారు. "ఇది ఎన్నికల ప్రచారం సభలా లేదు. విజయయాత్రలా ఉంది. మీ స్పందన చూస్తుంటే పట్నం నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమైంది. కొడంగల్ ప్రజల పట్టుదలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇంత గొప్ప స్థాయిలో సభ జరగడం సంతోషంగా ఉంది. కొడంగల్ నియోజకవర్గంలో బంగారం లాంటి భూములు ఉన్నాయి. కృష్ణానది నీళ్లు కొడంగల్ భూముల్లో పారాలి. పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించండి.. కృష్ణా నీళ్లతో మీ పాదాలు కడుగుతా. కొడంగల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేయండి. మీ నియోజకవర్గాన్ని నేనే దత్తత తీసుకుంటా`` అని సంచలన ప్రకటన చేశారు.
``ఆ గట్టు మీద కరెంటు అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ - టీడీపీ ఉంది.. ఈ గట్టు మీద 24 గంటల కరెంటు ఇచ్చిన టీఆర్‌ఎస్ ఉంది. ఆ గట్టు మీద మాటల నాయకుడు రేవంత్ రెడ్డి ఉన్నడు.. ఈ గట్టు మీద చేతల నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి ఉన్నడు.." అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ``పట్నం నరేందర్ రెడ్డిని కారులో అసెంబ్లీకి పంపించండి. అభివృద్ధి బాధ్యత మేమేం తీసుకుంటాం. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి దమ్ముంటే టీఆర్ ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి పై గెలవాలి. టీఆర్ ఎస్ అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే సన్యాసం తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?`` చాలెంజ్ విసిరారు.
నీళ్లు రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబుతో కాంగ్రెస్ సిగ్గు లేకుండా పొత్తు పెట్టుకుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ``కూటమికి ఓటేస్తే మన వేలితో మన కన్నే పొడుచుకున్నట్టు అయితది. నామినేషన్లు అయిపోయినా కూటమి నాయకులు సీట్లు పంచుకున్నరు. కూటమి సీట్లు పంచుకునే లోపు మేం గెలిచి స్వీట్లు కూడా పంచుకుంటాం. కూటమికి ఓడిపోయే సీట్లు పంచుకునేందుకు నెల రోజులు పట్టింది. అభివృద్ధి ఆగొద్దంటే టీఆర్ ఎస్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కొడంగల్ లో నరేందర్ రెడ్డిని గెలిపిస్తే లక్ష ఎకరాలకు కృష్ణా నీరు తెస్తం. `` అని హామీ ఇచ్చారు.