Begin typing your search above and press return to search.
మరీ.. ఇంత తొండి వాదనా కేటీఆర్?
By: Tupaki Desk | 21 Nov 2020 12:50 PM GMTనా ఇష్టం.. నాకు నచ్చినట్లు మాట్లాడతానని నేతలు అనొచ్చు. అర్థంపర్థం లేనట్లుగా.. లాజిక్కులకు భిన్నంగా మాట్లాడితే ఏ మాత్రం బాగోదు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ మాటలు ఇదే రీతిలో ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. రాజకీయ ప్రత్యర్థుల్ని దుమ్మెత్తి పోసే క్రమంలో ప్రతిసారీ చిత్రమైన వాదనను తీసుకొస్తుంటారు సీఎం కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్. ప్రత్యర్థి పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉంటే.. నిధులు భారీగా తీసుకురాగలరా? అంటూ సవాళ్లు విసురుతుంటారు.
అదే సమయంలో.. తాము ఓట్లు అడగటానికి వెళ్లే వేళలో మాత్రం.. మీరు ఓట్లు వెస్తేనే ఏదైనా చేయటానికి ఉంటుందని స్పష్టంగా చెప్పేస్తుంటారు. ఇదంతా చూసినప్పుడు ఎక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్పే తీరు కనిపించక మానదు. ఇలాంటి మాటలు మొదట్లో బాగున్నా.. అదే పనిగా విన్న తర్వాత మాత్రం తెలివి కాస్తా.. అతి తెలివిగా అనిపించక మానదు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిన టీడీపీ.. కాంగ్రెస్ పరిస్థితి ఈ రోజు ఏమైంది? తెలంగాణ ప్రకటనకు ముందు రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటిది ఈ రోజు ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితి. టీఆర్ఎస్ బాగు కోసం.. ఆ పార్టీ మరింత బలోపేతం కావటానికి వీలుగా ఏ రాజకీయ పార్టీ ఉండదు కదా? ఆ విషయం తెలిసి మరీ మంత్రి కేటీఆర్ సవాళ్లు విసరటానికి కారణం ఏమిటన్నది చూస్తే.. అదే టీఆర్ఎస్ గొప్పతనంగా చెప్పాలి. కాకుంటే.. ఇలాంటి తెలివి మాటలు అదేపనిగా చెబుతుంటే.. విషయం అందరికి అర్థం కావటమే కాదు.. ప్రజలకు సైతం చిరాకు పుట్టటం ఖాయమన్న విషయాన్ని కేటీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అయినా.. ఎప్పుడూ ఒకే కాన్సుప్టును వాడితే ఎమ్ బాగుంటుంది? కాస్త కొత్తగా ట్రై చేయొచ్చుగా చిన్న బాస్?
అదే సమయంలో.. తాము ఓట్లు అడగటానికి వెళ్లే వేళలో మాత్రం.. మీరు ఓట్లు వెస్తేనే ఏదైనా చేయటానికి ఉంటుందని స్పష్టంగా చెప్పేస్తుంటారు. ఇదంతా చూసినప్పుడు ఎక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్పే తీరు కనిపించక మానదు. ఇలాంటి మాటలు మొదట్లో బాగున్నా.. అదే పనిగా విన్న తర్వాత మాత్రం తెలివి కాస్తా.. అతి తెలివిగా అనిపించక మానదు.
తాజాగా నడుస్తున్న గ్రేటర్ పోరు నేపథ్యంలో.. బీజేపీ నేతల్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ఒక భారీ సవాలు విసిరారు. వారికి దమ్ముంటే.. కేంద్రం నుంచి రూ.లక్ష కోట్లు తీసుకురాగలరా? అని ప్రశ్నించారు. నిజంగానే లక్ష కోట్లు తెలంగాణకు ఇవ్వాలనుకుంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఎందుకు ఇస్తుంది. ఒకవేళ నిధులు ఇస్తే మాత్రం.. దాని క్రెడిట్ అంతా తమ ఖాతాలోనే వేసుకుంటారే తప్పించి.. లక్ష కోట్లు తెచ్చిన ఇచ్చిన వారి గురించి గొప్పగా అయితే చెప్పరు కదా?