Begin typing your search above and press return to search.

కేటీఆర్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా?

By:  Tupaki Desk   |   24 July 2021 7:30 AM GMT
కేటీఆర్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా?
X
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. టీఆర్ఎస్ అనుచరులు, ప్రజల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మంచు లక్ష్మీ, చిరంజీవి, సోనూసూద్, హరీష్ రావులు సోషల్ మీడియాలో కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక కేటీఆర్ సోదరుడు , రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ తన ప్రత్యేకత చాటుకుంటూ విభిన్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ చిన్నప్పటి ఫొటోను సంతోష్ షేర్ చేశాడు. ‘అప్పుడు.. ఇప్పుడు.. నా ప్రియమైన సోదరుడులో చాలా మార్పులను గుర్తించలేరు. నిత్యం అందమైన చిరునవ్వు ఆయన సొంతం.. ఇప్పుడు ఆ మౌనం వెనుక ఎంతో నిగూఢ అర్థం ఉంది. మీరు ఎల్లప్పుడు నాకు, చాలామందికి స్ఫూర్తినిస్తారు’ అంటూ సంతోష్ ట్వీట్ చేశారు.

సంతోష్ షేర్ చేసిన ట్వీట్ లో రెండు ఫొటోలున్నాయి. వాటిలో ఒకటి కేటీఆర్ చిన్న పాపగా ఉన్నప్పటిది. నల్లచొక్క వేసుకొని తలకు కుల్లా పెట్టుకొని ఉన్నాడు. చిన్నగా చిన్నప్పుడు నవ్వుతున్న ఫొటోలో శిశువుగా అందంగా కనిపిస్తున్నారు. ఇక మరోటి లేటెస్ట్ ఫొటోను నవ్వుతున్నది షేర్ చేశాడు.

కేటీఆర్ చిన్నప్పటి ఫొటో ఇప్పుడు సంతోష్ ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది.. ఆ ఫొటోను చూసి కేటీఆర్ ఇలా ఉండేవాడా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.