Begin typing your search above and press return to search.
కేటీఆర్ సీఎం రంగం సిద్ధం.. కేసీఆర్ బర్త్ డేకు అనౌన్స్?
By: Tupaki Desk | 5 Feb 2021 5:30 PM GMTసీఎం కేసీఆర్ పుట్టిన రోజు దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా పరిణామాలు వేగంగా సాగుతున్నాయట.. టీఆర్ఎస్ లో ఈ మేరకు తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఆధి శ్రావణయాగాన్ని నిర్వహిస్తుండడం ఇందుకు సంకేతం అన్న చర్చ జరుగుతోంది.
ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుంది. రాష్ట్ర కమిటీ సభ్యులతోపాటు రాష్ట్ర మంత్రులు, లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు , టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా దీనికి హాజరుకానున్నారు. పార్టీ సభ్యత్వాల పునరుద్దరణ, గ్రామస్థా యి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నియామకం.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఈ సమావేశంలోనే కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసే విషయంపై కేసీఆర్ కీలక ప్రకటన చేయవచ్చని చర్చ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కేసీఆర్ అందుకే నిర్వహిస్తున్నారని.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్నారనే ప్రచారం మొదలైంది.
కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతాడని.. కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పజెప్పుతాడని అంటున్నారు.