Begin typing your search above and press return to search.
రిటర్న్ గిఫ్ట్ మాత్రం పక్కాగా ఉంటుందన్న కేటీఆర్
By: Tupaki Desk | 19 March 2019 4:57 AM GMTతెలివైన రాజకీయ నేతలు ఎలా ఉంటారన్న విషయాన్ని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. వ్యూహాల్ని ఎప్పటికిప్పుడు మార్చుకోవటం.. పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించటం చాలా అవసరం. ఈ విషయంలో తమకు ఎవరూ పాఠాలు నేర్పించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కేటీఆర్ తాజా మాటల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.
లక్ష్యానికి చేరుకోవటమే ముఖ్యం తప్ప.. ఏ రీతిలో చేరుకున్నామన్నది ముఖ్యం కాదన్నట్లుగా వ్యవహరించే గులాబీ నేతల తీరుకు తగ్గట్లే తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోరు బాబుకు తెలంగాణకు మధ్యనేనన్న కలర్ ఇవ్వటమే కాదు.. సెంటిమెంట్ రగిల్చి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కేటీఆర్.. తాజాగా మరింత ఆసక్తికరంగా మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో తమను విజయ తీరాలకు చేర్చిన సెంటిమెంట్ ఏపీలో రగలకుండా ఉండాలంటే ఏం చేయాలన్న విషయంపై తనకున్న క్లారిటీని కేటీఆర్ తాజా మాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.
ఏపీ ప్రజలకు తమ అధినేత సందేశం ఇస్తారని.. ఏపీ రాజకీయాల్లోకి తాము ఎందుకు వేలు పెట్టకూడదంటూ ఆ మధ్య వరకు చెప్పిన మాటలకు భిన్నంగా కేటీఆర్ టోన్ మారింది. బాబుపై విమర్శలు చేసే కొద్దీ.. అది బాబుకు లాభంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించిన గులాబీ అధినాయకత్వం ఇప్పుడు తన గొంతును మార్చేసింది. ఏపీ రాజకీయాల్లో తమ పాత్రేమీ ఉండదంటూనే.. బాబుకు రిటర్న్ గిఫ్ట్ మాత్రం పక్కా అని చెప్పటం విశేషం. కొద్దిమంది మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన కేటీఆర్.. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే చెబితే..
+ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మా పాత్రేమీ ఉండదు. అక్కడ జరుగుతున్న ఎన్నికలను తెదేపాకి - కేసీఆర్ కూ మధ్య పోటీగా చూపే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. శాసనసభ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోతుంది. అక్కడి ప్రజలు ఇంటికి పంపిస్తారు
+ కేసీఆర్ తన కింద పనిచేశారని చంద్రబాబు అహంభావంతో మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి కింద ఎవరూ పనిచేయరు. చంద్రబాబు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అలాగే పనిచేశారా?
+ ‘తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న మా పార్టీకి ఏపీలో అడుగుపెట్టాలన్న ఆలోచనలేమీ లేవు. అక్కడ మేం పోటీ చేయడం లేదు. అక్కడి విషయాల్లో తలదూర్చం. బాబు ప్రతిరోజూ ఎన్టీఆర్ కంటే ఎక్కువగా కేసీఆర్ ను తలుచుకుంటున్నారు. జగన్ ఫ్యాన్ కు స్విచ్ ఎక్కడుందో చెప్పే బాబుకు.. సైకిల్ కు గాలి ఎవరు కొడుతున్నారో ప్రజలకు తెలుసు.
+ దిల్లీ రాజకీయాలలో ఎప్పుడు - ఎలా స్పందించాలో కేసీఆర్ కు తెలుసు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ - భాజపా అంటే పడని పార్టీలు చాలా ఉన్నాయి. వాటిని కూడగడతాం. ప్రజలకు ఏం అవసరమో అదే అజెండాగా ముందుకు వెళతాం
+ కేసీఆర్ కు రాజకీయంగా ఎలాంటి ఎత్తులు పైఎత్తులు వేయాలో తెలుసునని - అందుకే అభ్యర్థుల విషయంలో ఆయన ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు.
+ బాబు పచ్చి అవకాశవాది. ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరబోమని చెప్పే ధైర్యం లేదు. ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామా? లేదా? అన్నది ఏప్రిల్ 11 ఎన్నికల తర్వాత తెలుస్తుంది.
+ శాసనసభ్యుల పార్టీ మార్పిడి సహజం. వాటిపై కాంగ్రెస్ నేతల నీతులు చెబుతున్నారు. మోదీ - రాహుల్ లు ఇప్పుడు ఇతర పార్టీల వారికి కండువాలు కప్పుతున్నారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో మా పార్టీ ఎంపీ - నలుగురు ఎమ్మెల్సీలు ఇతర పార్టీల్లోకి మారారు. చేవెళ్ల ఎంపీకి రాహుల్ స్వయంగా కండువా కప్పారు. అప్పుడు ఏమైంది కాంగ్రెస్ నీతి. అప్పుడు మేమేం గొంతు చించుకోలేదే?
+ రేవంత్ రెడ్డి పెద్ద నాయకుడు కాదు. కొన్ని పత్రికలు - ఫ్లెక్సీల పులి. వాటిమీదే ఆధారపడి బతుకుతున్నాడు. కేసీఆర్ ను తిడితే నాయకుడు కాలేడు.
+ పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఆయన ఇక్కడ కూడా ప్రచారం చేసుకోవచ్చు.