Begin typing your search above and press return to search.
నాన్నను అడిగే చెబుతున్నావా కేటీఆర్?
By: Tupaki Desk | 15 Oct 2015 5:30 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఎంతటి మాటల మనిషో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు అంశాల మీద అలవోకగా మాట్లాడే కేటీఆర్ కు.. ఏ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనకు ఓ చిత్రమైన ప్రశ్న ఎదురైంది. ఏపీ రాష్ట్ర రాజధాని శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళుతున్నారా? అని ప్రశ్న సంధించారు. సదరు జర్నలిస్టు నోటి నుంచి వచ్చిన ఈ ప్రశ్నకు కేటీఆర్ ఏం సమాధానం చెబుతారన్న ఆసక్తి వ్యక్తమైంది. మరి ఏ మైండ్ సెట్ తో ఉన్నారో కానీ.. తమకు కానీ ఆహ్వానం అందితే.. శంకుస్థాపనకు వెళ్లి తమ ఆశీస్సులు అందిస్తామని ప్రకటించారు.
శంకుస్థాపనకు తమకు కానీ ఆహ్వానం అందితే.. అమరావతి వెళతామని అధికారికంగా కన్ఫర్మ్ చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుణ్యమా అని పలు ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అధికారికంగా పిలిస్తేనే వెళతామన్న సంకేతాన్ని తెలంగాణ అధికారపక్షం గుర్తించినట్లుగా కేటీఆర్ మాటలు అవకాశాన్ని ఇస్తున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయ ప్రముఖులు ఒకరిద్దరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సర్వ స్వతంత్ర్యంగా వ్యవహరించే కేసీఆర్ కు సంబంధించి..కీలకమైన అంశాలకు సంబంధించి కేటీఆర్ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా? లేదా? అన్నది ఒక ప్రశ్నగా మారింది. ఇన్విటేషన్ వస్తే చాలు.. అమరావతి వెళతామన్న మాట చెబుతున్న కేటీఆర్.. ఆ మాటను తన తండ్రి అనుమతి తీసుకునే మాట్లాడారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.