Begin typing your search above and press return to search.
దత్తన్న బాధ పడతుంటే..ఇవేం మాటలు కేటీఆర్?!
By: Tupaki Desk | 3 Sep 2017 5:18 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే సంగతి తెలిసిందే. ట్వీట్ల ద్వారా తన దృష్టికి వచ్చిన అంశాలపై వెంటనే స్పందిస్తారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన కేబినేట్ విస్తరణ పై కేటీఆర్ కు ట్వీట్లు చేశారు. వాటిపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. కొత్తగా పదవులు పొందిన కేంద్రమంత్రులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తూ ఈ సందర్భంగా సౌమ్యుడనే పేరున్న బీజేపీ సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను ఒకింత కెలికారు.
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవులు పొందిన, కేబినెట్ మంత్రులుగా ప్రమోషన్ దక్కిన వారికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్రప్రదాన్ - నిర్మలా సీతారామాన్ - సురేశ్ ప్రభు సహా మిగతా వారందరికీ ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తనను ప్రస్తావిస్తూ పేర్కొన్న పలు ట్వీట్లపై కేటీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుంచి ఉన్న ఒక్కరిని కూడా తొలగించడం గురించి మీ అభిప్రాయం ఏమిటని ఓ వ్యక్తి ట్వీట్ చేయగా... ‘ తెలంగాణ కోసం చెప్పుకోదగిన గొప్ప పని ఆయనేది చేయలేకపోయినప్పటికీ...కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఉన్న ఏకైక వ్యక్తిని పదవి నుంచి ఊడబీకడం మంచి సంకేతాన్ని పంపించదు’ అని విశ్లేషించారు. కాగా ఇప్పటికే అకస్మాత్తుగా కేంద్ర అమాత్య పదవి కోల్పోయి ఒకింత అల్లరతో ఉన్న అలాయ్ బలాయ్ దత్తన్నను కేటీఆర్ ఈ రకంగా కెలుకటం ఏమిటని పలువురు పెదవి విరుస్తున్నారు.
ఇక కేంద్ర రైల్వే శాఖ మంత్రి బాధ్యతల నుంచి సురేశ్ ప్రభు వైదొలగడం గురించి కూడా కేటీఆర్ భిన్నంగా స్పందించారు. సురేశ్ ప్రభు వైదొలడం ద్వారా తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దక్కుతుందా అనే ఓ వ్యక్తి ట్వీట్ చేయగా... దానికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ...‘పదవిలో ఎవరు ఉన్నారనే దానితో సంబంధం లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి హామీలను నిలుపుకోవాల్సిందే’ అని అన్నారు. గతంలో బ్యూరోక్రాట్లుగా పనిచేసిన వారు కేబినెట్‌లో పనిచేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారనే విషయాన్ని ఓ వ్యక్తి ప్రస్తావించగా..‘అనుభవజ్ఞులైన బ్యూరోక్రాట్లు, ఉత్తమమైన పనితీరును కనబర్చిన వారు కేంద్ర మంత్రివర్గంలో చేరడం మంచి పరిణామం. అయితే పార్టీలకు అతీతంగా కేవలం ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పనిచేస్తే దేశానికి మేలు జరుగుతుంది’’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.