Begin typing your search above and press return to search.
జానాను అంతమాట అనేశారేంటి కేటీఆర్?
By: Tupaki Desk | 14 Feb 2017 4:59 AM GMTసీనియర్లను గౌరవించటం తమ తర్వాతే అన్నట్లుగా మాట్లాడుతుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ లు. ఈ విషయాన్ని తియ్యటి మాటలతో చాలాసార్లు చెప్పేస్తుంటారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో అయితే.. లైవ్ టీవీల సాక్షిగా.. పెద్దలు జానా అంటే తమకెంతో గౌరవం.. మర్యాద అంటూనే అనాల్సిన మాటలన్నీ అనేస్తుంటారు. గౌరవిస్తూనే గాలి తీసే చిత్రమైన ప్రోగ్రామ్ కు కేసీఆర్ అద్యులైతే.. దాన్ని సమర్థంగా కంటిన్యూ చేస్తున్న ఘనత కేటీఆర్.. హరీశ్ రావుల్లాంటి వారికి దక్కుతుంది.
ఇటీవల కాలంలో తెలంగాణ సర్కారుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడటమే కాదు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీట ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ విధానాల్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ విషయంలో ప్రభుత్వానికి చుక్కలు చూపించేలా చేయటంలో విపక్షాలు కొంతమేర సక్సెస్ అవుతున్నాయనే చెప్పాలి. దీంతో.. అధికారపక్ష నేతల్లో అసహనం హద్దులు దాటుతోంది.
ఈ కారణం వల్లే కావొచ్చు.. తామెంతో మర్యాదగా.. గౌరవంతో.. పూజ్యులు.. గౌరవనీయులు అనే నోటితోనే.. ఇష్టారాజ్యంగా తిట్టేయటం కనిపిస్తుంది. ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలుస్తూ.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ గుస్సా ప్రదర్శించారు. నిర్వాసితుల కష్టాలు తమకు తెలిసినంతగా మరెవరికీ తెలీదని మండిపాటు ప్రదర్శించిన కేటీఆర్.. బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.
‘బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమే తప్పించి.. దారిన పోయే దానయ్యలు.. జానాబెత్తెడు జానారెడ్డితో ఏం కాదు’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. తాము ప్రజలకు జవాబుదారులం తప్పించి.. ప్రజలు విడిచిపెట్టిన ప్రతిపక్షాలకు కాదంటూ పంచ్ డైలాగ్ లాంటి మాటను చెప్పేశారు. మర్యాద.. గౌరవం అన్నది తమకు చాలా ఎక్కువని చెప్పే కేటీఆర్.. సీనియర్ నేతలు.. తెలంగాణ రాష్ట్రానికి సీనియర్ నేతల్లో ఒకరైన జానారెడ్డి లాంటి వారి విషయంలో అంత చులకనగా ఎలా మాట్లాడతారన్నది ప్రశ్న.
మిగిలిన నేతలతో పోలిస్తే.. జానారెడ్డి ఈ రోజుకూ హుందాగా మాట్లాడతారే తప్పించి.. నోరు జారే ప్రయత్నం అస్సలు చేయరు. అలాంటి నేత విషయంలోనూ కేటీఆర్ అంత తొందరపాటు మాటను ఎందుకు అనేసినట్లు? అన్నది ప్రశ్న. కేటీఆర్ వైఖరి చూస్తుంటే.. తెలంగాణ అధికారపక్షాన్ని డిఫెన్స్ లో పడేయటంలో తెలంగాణ విపక్షాలు దూకుడుగా వెళుతున్నట్లు అనిపించట్లేదు..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/