Begin typing your search above and press return to search.
రూ.లక్ష కోట్లకు టార్గెట్ పెట్టిన కేటీఆర్
By: Tupaki Desk | 26 Dec 2015 5:00 AM GMTతమ మాటలతో ప్రత్యర్థుల్ని ఢిఫెన్స్ లో పడేయటం.. వారిని రెచ్చగొట్టటం.. అంతిమంగా ఫలితం మాత్రం తమకు అనుకూలంగా వచ్చేలా చూసుకోవటం టీఆర్ఎస్ నేతలకు అలవాటే. మీరు అది చేస్తారా? ఇది చేస్తారా? అసలు అలా చేసే దమ్ముందా? అంటూ సవాళ్లు విసురుతూ రెచ్చగొట్టేస్తుంటారు. వారి మాటల ప్రభావంతో రాజకీయ ప్రత్యర్థులు రెచ్చిపోతారే తప్పించి.. ‘‘అన్నీ మేమే చేసే దానికి మీకు అధికారం ఎందుకు నాయనా? మేం అన్ని తెచ్చి పెడితే మీరు మాత్రం అధికారాన్ని ఏలుకుంటారా? మీకంటూ పని చేసే సత్తా లేదా? మాటలు చెప్పే కన్నా చేతల్లో చేసి చూపించేది ఏదైనా ఉందా?’’ అంటూ ఎదురుదాడి చేసే రాజకీయ పక్షం కనిపించదు. తమకు బాగా అలవాటైన రివర్స్ గేర్ హ్యామరింగ్ ను బీజేపీ నేతలపై ప్రయోగిస్తోంది తెలంగాణ అధికారపక్షం.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ.. తెలంగాణ కాంగ్రెస్ నే ఇదే రీతిలో రెచ్చగొట్టి.. అంతిమంగా తాము అనుకున్నది సాధించి.. కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా చేసిన టీఆర్ ఎస్ నేతలు.. అదే వ్యూహాన్ని తెలంగాణ బీజేపీ నేతల మీద ప్రయోగించటం గమనార్హం. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను ప్రధానమంత్రి అస్సలు పట్టించుకోవటం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తరచూ విదేశాలకు వెళ్లే ప్రధానమంత్రి.. తెలంగాణ ముఖం చూడటం లేదని.. తమ రాష్ట్రాన్ని అస్సలు పట్టించుకోవటం లేదంటూ విమర్శలు చేశారు.
కేంద్రం ఇవ్వాల్సిన వాటి గురించి తరచూ మాట్లాడే గులాబీ దళం.. ఇప్పటికే కేంద్రం ఇచ్చిన వాటి గురించి.. పొందిన ప్రయోజనాన్ని ప్రస్తావించరు. ఆ విషయాన్ని గుర్తు చేసే విషయంలోనూ తెలంగాణ బీజేపీ నేతల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రం చేసిన పనుల గురించి ప్రస్తావించి.. తెలంగాణ అధికారపక్షానికి చెక్ చెప్పే విషయంలో తెలంగాణ బీజేపీ విఫలం కావటం తెలంగాణ అధికారపక్షానికి కలిసి వస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఉద్యమ సమయంలో నాటి కేంద్రం మీద ఎలాంటి దాడి చేశారో.. అదే తీరులో తాజాగా మోడీ సర్కారు మీదా టీఆర్ ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాటలే దీనికి నిదర్శనం. బీహార్ కు రూ.1.5లక్ష కోట్లు.. జమ్మూకాశ్మీర్ కు భారీ ప్యాకేజీ ప్రకటించిన ఆయన తెలంగాణ కు మాత్రం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే ఢిల్లీకి పోయి.. కేంద్రాన్ని అడిగి తెలంగాణకు రూ.లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకురావాలంటూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలను నిలదీస్తున్నారు.
దేశంలో తమదీ ఒక సంపన్న రాష్ట్రమని.. తాము డబ్బులున్నోళ్లమని తరచూ గొప్పలు చెప్పుకునే కేటీఆర్ తండ్రి కేసీఆర్ మాటల్ని కమలనాథులు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినా.. డబ్బులున్న మారాజులు నలుగురికి ఇవ్వాలే కానీ.. నిత్యం కేంద్రం మీద ఆధారపడటం ఏమిటి? అన్న ప్రశ్న కేటీఆర్ మాటల్ని వింటే తలెత్తక మానదు.
నిత్యం డాబు మాటలు చెబుతూ.. అంతలోనే పేదరికం అరుపులు అరవటం మొత్తం రాజకీయమే తప్పించి.. ప్రజా ప్రయోజనాలకు ఏ మాత్రం లబ్థి చేకూరదన్న విషయం గులాబీ నేతలకు తెలియంది కాదు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ.. పనులు పూర్తి చేసుకోవాలే తప్పించి రాజకీయంగా ఇరుకున పెడదామన్న ప్రయత్నం చేస్తే.. అది తెలంగాణకు మరింత నష్టం చేకూరుస్తుందే తప్పించి.. ఇసుమంతైనా లాభం చేయదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆ విషయం నిత్యం తిట్టే కేటీఆర్ కు ఎటూ పట్టదు. కనీసం.. తిట్టించుకునే బీజేపీ నేతలైనా గులాబీ నేతలకు అర్థమయ్యేలా చెప్పరెందుకు..?