Begin typing your search above and press return to search.
లాజిక్ లాగి మరీ మోడీని ప్రశ్నించిన కేటీఆర్
By: Tupaki Desk | 27 Feb 2018 5:34 PM GMTఇటీవల కేంద్ర ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ మరోమారు కేంద్రం తీరుపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఈ దఫా తన అసంతృప్తిని రాజకీయంగా కాకుండా గణాంకాల ఆధారంగా లాజిక్ లాగుతూ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల హామీలను ప్రశ్నిస్తూ తమ సంగతి ఏంటని నిలదీశారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రికి లేఖ రాశారు. తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ర్ట పరిశ్రమల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ కారిడార్ ఎర్పాటు తెలంగాణకు అన్ని రకాల అర్హతలున్నాయన్నారు. ఈ కారిడార్ ఏర్పాటు ద్వారా తెలంగాణలో స్థానిక యువతకు మరింత ఉపాది లభిస్తుందన్నారు.
ప్రధాని మోడీ ఇటీవలే బుందేల్ ఖండ్, చెన్నై- బెంగళూర్ ప్రాంతాలకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి తమ సంగతి ఏంటని ప్రశ్నించారు. గత 5 దశాబ్దాలుగా అద్భుతమై ఏయిరో స్సేస్ అండ్ ఢిపెన్స్ ఈకోసిస్టమ్ తెలంగాణలో ఉన్నదన్న మంత్రి ఆ రెండు రాష్ర్టాల వలే ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించిన తీరుగానే తెలంగాణకు సైతం కేటాయించాలన్నారు. ఈ బడ్జెట్ లో రెండు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్లను ప్రకటించిన కేంద్రం, అన్ని విధాల అనువైన పరిస్ధితులున్నప్పటికీ తెలంగాణను విస్మరించడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాసిన లేఖలో తమ డిమాండ్ వెనుక శాస్త్రీయత ఏంటో కూడా కేటీఆర్ వివరించారు. తెలంగాణ వ్యూహాత్మకంగా కీలక ప్రదేశంలో ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డీఆర్‌డీవో - ఆర్‌సీఐ - డీఆర్‌డీఎల్ - బీడీఎల్ - మిథాని - ఏన్‌సీఎల్ వంటి అనేక రక్షణ రంగ సంస్ధలు హైదరాబాద్‌లో ఉన్నాయని మంత్రి తన లేఖలో గుర్తు చేశారు. దీంతో పాటు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ - హెచ్ బియల్ - అస్ర్టా మెదలయిన ప్రయివేట్ రంగంలోనూ పలు సంస్ధలు ఏయిరో స్పేస్ మరియు ఢిపెన్స్ రంగంలో పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణకు ఉన్న మౌళిక వసతులతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఏయిరోస్సేస్ ఢిపెన్స్ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా పెట్టుకుందని కేటీఆర్ వివరించారు. ఈ మేరకు ఆదిబట్ల, జీఎంఆర్ విమానాశ్రాయానికి అనుకుని ఉన్న రెండు పార్కుల్లో ఇప్పటికే ఈ రెండు రంగాల్లో ఉత్పత్తులు కొనసాగుతున్నాయన్నారు. దీంతో పాటు ఎలిమినేడులో మరోపార్కు, మెదక్ లోని నిమ్జ్ లో ప్రత్యేకంగా మరోక ఏయిరో స్పేస్ ఢిపెన్స్ క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.
హైదరాబాద్ నగరంలో ఢిఫెన్స్ ఇంక్యూబేటర్ ఎర్పాటును సైతం ప్రభుత్వం పరిశీలీస్తుందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇంతలా ప్రభుత్వ ఢిపెన్స్ తయారీ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించేందుకు అన్ని అర్హతలున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం సానూకూలంగా స్పందించి తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కోరారు. కాగా, కేటీఆర్ డిమాండ్ నేపథ్యంలో కేంద్రం ఎలా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది.