Begin typing your search above and press return to search.
ఫార్టీ పెట్టినోడు.. ఫినిష్ చేశామన్నోడు తారక రామారావే
By: Tupaki Desk | 7 April 2019 6:24 AM GMTతెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటుకు సంబంధించి ప్రకటనను చేసింది హైదరాబాద్ లోనే. ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీకి పురిటిగడ్ఢ హైదరాబాద్ గా చెప్పాలి. పార్టీని ఏర్పాటు ప్రకటన 1982లో చేస్తే.. పార్టీ కథ ముగిసిందన్న మాట 2019లో వచ్చినట్లైంది. దాదాపు మూడున్నర దశాబ్దాల టీడీపీ యాత్ర తాజాగా ముగిసినట్లేనని చెప్పాలి. తెలంగాణలో టీడీపీ అన్న మాట గతమని చెప్పాలి. ఇక.. ఏదైనా మిగిలి ఉందంటే అది తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ వేరే ఏదైనా పార్టీలో చేరటం మాత్రమే మిగిలి ఉందని చెప్పాలి.
తెలుగుగడ్డ మీద తెలుగుదేశం పార్టీ బలంగా ఉందంటే అది తెలంగాణలోనే అన్న మాట నిన్నటిగా మారిందని చెప్పాలి. తాజాగా టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోట.. తెలంగాణలో టీడీపీ కథ ముగిసిందన్న ప్రకటనతో ఆ పార్టీ దుకాణం క్లోజ్ అయినట్లే. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తెలుగుదేశం పార్టీని పెట్టింది రామారావు అయితే.. పార్టీ తెలంగాణలో క్లోజ్ అయ్యిందన్న మాట కూడా రామారావు నోటి నుంచే రావటం.
పార్టీని నందమూరి తారక రామారావు ప్రకటించే వేళ.. ఎంత సంతోషంగా.. ఎంత ఉత్సాహంగా ప్రకటించారో.. ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన పేరునే తన కొడుక్కి పెట్టుకున్నారు కేసీఆర్. అందరికి సుపరిచితమైన కేటీఆర్ పేరుకు.. పూర్తి పేరు కల్వకుంట్ల తారక రామారావు. ఎన్టీఆర్ ను విపరీతంగా ఆరాధించే కేసీఆర్.. తన కొడుక్కి తానెంతో అభిమానించే ఎన్టీఆర్ పేరును పెట్టుకున్నారు. ఇప్పుడు అదే తారక రామారావు తెలుగుదేశం పార్టీ కథ ముగిసిందని.. తెలంగాణలో ఆ పార్టీ ప్రయాణం పూర్తి అయ్యిందన్న మాటను చెప్పారు. పార్టీ పెట్టినోడి పేరునే అభిమానంగా పెట్టుకున్న వ్యక్తి కొడుకే.. ఆ పార్టీ ముగింపు ప్రకటనను చెప్పటం టీడీపీకే చెల్లుతుందేమో?