Begin typing your search above and press return to search.
టీడీపీ 'క్యాష్ ఫర్ ట్వీట్స్' .. కేటీఆర్ ఫిర్యాదు
By: Tupaki Desk | 5 March 2019 5:49 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆధారాలతో సహా టీడీపీ క్యాష్ ఫర్ ట్వీట్స్ స్కామ్ ను బయటకు తీశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి టీడీపీ పెయిడ్ ట్వీట్లను పెట్టిస్తున్న వైనాన్ని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రట్టు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను చూపుతూ తాజాగా ట్విట్టర్ కు, సైబర్ క్రైమ్ పోలీసులకు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. టీడీపీ ‘క్యాష్ ఫర్ ట్వీట్స్’ స్కామ్ చేస్తోందని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను.. అటు ట్విట్టర్ ప్రతినిధులను కోరారు..
ఏపీ ప్రభుత్వ డేటాను తెలంగాణ ప్రభుత్వం తస్కరించిందని.. ఒకే ట్వీట్ ను కొన్ని వందల అక్రమ అకౌంట్స్ నుంచి పెట్టించారని కేటీఆర్ పేర్కొన్నారు. అందులో ఏపీకి అస్సలు సంబంధం లేని వారు ఉన్నారని.. దేశంలోని ఎక్కడెక్కడి అకౌంట్ల నుంచి ఒకే ట్వీట్ ను వైరల్ చేయడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా టీడీపీ స్కామ్ అని కేటీఆర్ ఆధారాలతో బయటపెట్టారు.
ఫాలోవర్ల సంఖ్య బాగా ఉన్న ఫేక్ అకౌంట్ల నుంచి ఒకే ట్వీట్ ను పెట్టి.. హ్యాష్ ట్యాగ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి టీడీపీ కుట్ర చేసిందని.. ఈ విషయాన్ని తాము ఊరికే వదలమని... ఈ క్యాష్ ఫర్ ట్వీట్స్ స్కామ్ పై ట్విట్టర్ కు, సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినట్టుగా కేటీఆర్ తెలిపారు.