Begin typing your search above and press return to search.
పార్టీ పగ్గాలకు ఏడాది? కేటీఆర్ పాసా.? ఫెయిలా?
By: Tupaki Desk | 17 Dec 2019 4:37 AM GMTనాన్న పరిచిన బాట.. సులువుగానే రాజకీయ అధికారం దక్కింది. కానీ నడిపించేది నాన్న కాదు.. కేవలం ప్రోత్సాహాన్ని మాత్రమే ఇచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి కేటీఆర్ కు అప్పుడే ఏడాది నిండిపోయింది. తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్ గత ఏడాది ఇదేరోజున డిసెంబర్ 17న కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏడాది పూర్తి చేసుకున్న కేటీఆర్ ఇంతకీ ఈ ఏడాదిలో ఏం సాధించాడు? పార్టీని ఎలా నడిపించాడు?
కేటీఆర్ రాజకీయ ప్రవేశమే ఆసక్తిగా మొదలైంది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదులుకొని 2006లో క్రియాశీల రాజకీయాల్లోకి కేటీఆర్ వచ్చారు. 2008లో 39మందిలో ఒకడిగా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేవలం 200 ఓట్లలోపు మెజార్టీతో అతి కష్టం మీద గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2010,2014,2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. తెలంగాణ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.
*చెరగని ముద్ర
కేటీఆర్ గడిచిన ఐదేళ్లలో మంత్రిగా ఐటీపై చెరగని ముద్రవేశారు. ఐటీని ప్రోత్సహించడానికి దేశాలు తిరిగారు. దిగ్గజ సంస్థలను కలిసి కీలక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ఐటి పురోభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. కేటీఆర్ ప్రారంభింపచేసిన టీహబ్, ఐటీ రంగం అభివృద్ధికి దోహదపడింది. ఇక మిషన్ భగీరథ, గ్రామ జ్యోతి వంటి పథకాలను అమలు చేసిన కేటీఆర్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.
*రాజకీయంగానూ విజయాలు
కేటీఆర్ రాజకీయంగానూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనను తాను నిరూపించుకున్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సొంతంగా 99 సీట్లు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా 55 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేసి టీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యాక జరిగిన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ పార్టీని విజయతీరాలకు చేర్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆశించిన విజయాలను సొంతం చేసుకోలేకపోయారు.
ఇక పార్టీ సభ్యత్వాన్ని 60 లక్షలు దాటించి, బూత్, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. ఇక త్వరలోనే 22 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలను చేపట్టారు.
కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏడాదిలో ఎన్నో విజయాలను అందుకున్నారు. సవాళ్లను స్వీకరించారు. ఒక్క పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే 16 సీట్లను గెలుచుకుంటానని చెప్పి 9కే పరిమితం చేశారు. ఆ ఒక్క అపజయం తప్పితే ఏడాదిలో కేటీఆర్ విజయాల శాతం 80శాతంపైనే ఉంది.