Begin typing your search above and press return to search.
పుర ఎన్నికల్లో కేటీఆర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే?
By: Tupaki Desk | 12 Jan 2020 3:47 AM GMTఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా వస్తున్న ఎన్నికల్లో తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్.. కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ అధికారపక్షానికి తిరుగులేని అధిక్యత ఉన్న వేళ.. ప్రతిపక్షాలు బలంగా లేకపోవటం గులాబీ పార్టీకి లాభం చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుర ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకంగా ఉంటే.. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. పుర ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూల ఫలితాలు రావటం ఖాయమని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్నవిషయంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని చూస్తే..
% విపక్షాలు మాకు పోటీనే కాదు. ఒంటరిగా ఎదర్కొనలేక.. నిజామాబాద్.. జగిత్యాల.. రాయకల్.. వేములవాడ.. గద్వాల.. నారాయణపేట తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్.. బీజేపీలు అవగాహనతో పోటీ చేస్తున్నాయి. పుర ఎన్నికల్లో తప్పుడు పద్దతుల్ని అవలంభిస్తున్నాయి. పార్టీలు కలిసినంత మాత్రాన ఓటర్ల ఓట్లు బదిలీ కావు.
% పుర ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయాన్ని సాధిస్తాం. పార్టీ తరఫున అన్ని విధాలుగా రెఢీగా ఉన్నాం. గెలుస్తామన్న నమ్మకంతోనే టికెట్ల కోసం డిమాండ్ భారీగా ఉంది. అర్హుల్లో కొందరికి టికెట్లు దక్కకపోవచ్చు. అలాంటి వారిని పార్టీ పదవుల్లో.. ప్రభుత్వ నియమిత పదవుల్లో నియమిస్తాం.
% ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ప్రజలకు అందుతున్నాయి. వారు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం మరో నాలుగేళ్లు స్థిరంగా ఉంటుంది.