Begin typing your search above and press return to search.
‘‘గెస్ట్’ అని కేటీఆర్ తప్పులో కాలేశాడా?
By: Tupaki Desk | 28 Jan 2016 6:23 AM GMTఆచితూచి మాట్లాడుతూ.. తప్పులు దొర్లకుండా.. భావం చెడకుండా మాట్లాడే మంత్రి కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారా? అనవసరంగా నోరు జారి బుక్ అయ్యారా? లోకల్ అన్న మాట స్థానే గెస్ట్ అంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి. గ్రేటర్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టింది మొదలు ఇప్పటివరకూ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉన్న కేటీఆర్.. తమ్ముడు లోకేశ్ మాటల ఘాటుతో ఒత్తిడికి గురయ్యారా? అన్న సందేహం కలగక మానదు.
తమ్మి లోకేశ్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించినా.. అన్నా కేటీఆర్ అంటూనే లోకేశ్ ఇచ్చిన కౌంటర్ అటాక్ కేటీఆర్ కు కొత్త అనుభవంగా చెప్పొచ్చు. తమ్మి మాటతో అధిపత్యాన్ని ప్రదర్శించాలని కేటీఆర్ భావిస్తే.. అన్నా అంటూ ‘‘నువ్వు చదివింది యాడే’’ అంటూ గుంటూరు సంగతుల్ని తెర మీదకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారని చెప్పక తప్పదు. ఈ క్రమంలో మాటల్లో డోసు పెంచాలని కేటీఆర్ భావించారేమో కానీ.. మీరు స్టేట్ గెస్ట్ లు చక్కగా ఉండండి.. మీ అమరావతిని మీరు చూసుకోండి.. మా హైదరాబాద్ ను మేం చూసుకుంటామంటూ కేటీఆర్ అన్న మాటలు ‘లోకల్’ రచ్చలోకి తీసుకెళ్లిపోయాయి.
తాజాగా విపక్ష నేతలు విమర్శలు చూస్తే.. మొత్తం కేటీఆర్ ‘‘గెస్ట్’’ చుట్టూనే తిరుగుతండటం దీనికి నిదర్శనం. ఓపక్క తానూ సెటిలర్ నే అని చెప్పిన కేటీఆర్.. ఇప్పుడు లోకేశ్ స్థాయి వ్యక్తిని సైతం నువ్వు స్టేట్ గెస్ట్ వి అనటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ గల్లీల్లో తిరిగిన లోకేశ్ నే గెస్ట్ అంటే.. మిగిలిన వాళ్ల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
లోకేశ్ విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటేనే వారి తీరు ఏమిటో అర్థమవుతుందని టీటీడీపీ నేతలు విరుచుకుపడుతుంటే.. ఉద్యమ సమయంలో కేసీఆర్ నోటి నుంచే సెటిలర్ల అన్న పదం వచ్చిందని.. ఇప్పటికి హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తున్నారంటూ వీహెచ్ లాంటి కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. మొత్తమ్మీదా ‘గెస్ట్’ అన్న మాటతో కేటీఆర్ తప్పులో కాలేసినట్లేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.