Begin typing your search above and press return to search.
లోకేశ్ తమ్మీకి అన్న వేస్తున్న సూటి ప్రశ్న
By: Tupaki Desk | 30 Jan 2016 4:34 AM GMTగ్రేటర్ ఎన్నికల్లో విమర్శలు.. ప్రతివిమర్శలు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. నిందలు.. చురుకులు లాంటివి చాలానే చోటు చేసుకున్నాయి. అన్ని ఒక ఎత్తు అయితే.. ఏపీ ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్.. తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం మరో ఎత్తుగా చెప్పాలి. లోకేశ్ మీద అధిపత్యం ప్రదర్శించేందుకు తమ్మీ అంటూ కేటీఆర్ గుగ్లీ వేస్తూ.. దాన్ని అలవోకగా ఆడేసిన లోకేశ్.. కేటీఆర్ అన్న అంటూ అదే స్థాయిలో చురుకు పుట్టే వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న సంవాదంలో తాజాగా మరో ఆసక్తికర వ్యవహారం తెరపైకి వచ్చింది. లోకేశ్ ను కేటీఆర్ గెస్ట్ గా అభివర్ణించటం.. దానికి ప్రతిగా లోకేశ్ రియాక్ట్ అవుతూ.. హైదరాబాద్ గల్లీల్లో తిరిగి పెద్ద అయిన తనకు.. గుంటూరులో చదువుకున్న కేటీఆర్ గెస్ట్ అనటమేమిటంటూ కౌంటర్ వేశారు.
దీనికి కొనసాగింపుగా తాజాగా లోకేశ్ ను ఇరుకున పెట్టేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో చదువుకున్న విషయాన్ని తెర మీద తెచ్చిన లోకేశ్ ను డిఫెన్స్ లో పడేసేలా కేటీఆర్ తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఇందుకు మరోసారి తమ్ముడని సంబోధిస్తూ.. ‘‘మా తమ్ముడు లోకేశ్.. ఆంధ్రాలో ముఖ్యమంత్రి కావటానికి ప్రయత్నిస్తాడా? లేక తెలంగాణ నుంచి పోటీ చేస్తాడా? ఆ విషయం ముందు చెప్పమనండి’’ అంటూ కేటీఆర్ ప్రశ్నాస్త్రం సంధించారు. మరి కేటీఆర్ అన్న వేసిన ప్రశ్నకు తమ్ముడు లోకేశ్ ఎలా రియాక్ట్ అవుతారో?