Begin typing your search above and press return to search.
తండ్రి మాటకే జై కొట్టిన కేటీఆర్
By: Tupaki Desk | 8 March 2018 10:03 AM GMTగులాబీ దళపతి - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై ఆయన తనయుడైన రాష్ట్ర మంత్రి కేటీఆర్ మొట్టమొదటి సారిగా రియాక్టయ్యారు. దేశంలో గుణాత్మక రాజకీయాలు రావాలని ఆకాంక్షిస్తూ ఇందుకు తాను థర్డ్ ఫ్రంట్ ద్వారా దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ స్థాయిలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. కాగా, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ మాత్రమే ప్రత్యామ్నాయమని కేటీఆర్ అన్నారు.
భారతదేశం రెండు పార్టీలకే చెందదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మన దేశంలో అనేక పార్టీలు ఉన్నాయని, మనది రెండు పార్టీల ప్రజాస్వామ్యం కాదని - ప్రాంతీయ పార్టీలు కూడా మన దేశంలో బలంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు థర్డ్ ఫ్రంట్ కు మంచి అవకాశం ఉందని - లేదంటే థర్డ్ ఫ్రంటే ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నికల కోసం మరో ఏడాది కాలం ఉందని - మునుముందు సమీకరణలు ఎలా మారుతాయో వేచి చూద్దామన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా దేశ ప్రజలు కాంగ్రెస్ - బీజేపీ పార్టీలకు అనేక అవకాశాలు ఇచ్చారని- కానీ ఆ పార్టీలు ప్రజల ఆశయాలను తీర్చలేకపోయాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాగా, బేగంపేట ఎయిర్ పోర్టులో వింగ్స్ ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు ఏరోస్పేస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ దేశంలోనే నంబర్ వన్ అని అన్నారు. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని తెలిపారు. ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఈ సదస్సుకు అమెరికా - జపాన్ - యూకే - రష్యా - సింగపూర్ సహా 10 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 125 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ నెల 11 వరకు ఏవియేషన్ షో నిర్వహించనున్నారు.