Begin typing your search above and press return to search.

దావోస్ అందాల‌కు మంత్రి కేటీఆర్ ఫిదా

By:  Tupaki Desk   |   23 Jan 2018 11:55 AM GMT
దావోస్ అందాల‌కు మంత్రి కేటీఆర్ ఫిదా
X
స్విట్జర్లాండ్‌లో ఇప్పుడు చ‌లికాలం. ప్ర‌స్తుతం అక్క‌డ కీల‌క‌మైన వ‌రల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం జరుగుతోంది. ఇవాళ్టి నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు జరగనున్న నేప‌థ్యంలో ఇప్పటికే ఆ నగరానికి ప్రపంచదేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు చేరుకున్నారు. ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ - తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు. అయితే విప‌రీతంగా కురుస్తున్న మంచు కార‌ణంగా...అక్కడి ఆల్ప్స్ పర్వతాలు ఇప్పుడు మంచు ప్రదేశాలుగా మారాయి. ఆ అద్భుత పర్వతాల సమీపంలో ఉన్న దావోస్ నగరం కూడా మంచు నగరంగా మారింది.

ఇలా వీధులన్నీ మంచుతో నిండిన ఆ నగరాన్ని చూసిన మంత్రి కేటీఆర్ థ్రిల్ అయ్యారు. తన మొబైల్ కెమెరాలో ఆ రమణీయ అందాలను బంధించారు. దావోస్ అందాలు నిజంగా అబ్బురపరుస్తున్నాయంటూ ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. అంతకముందు ఆయన తాను బస చేస్తున్న హోటల్ గది నుంచి ఓ సెల్ఫీ దిగి - దాన్ని తన ట్విట్టర్ అకౌంట్‌ లో పోస్టు చేశారు. స‌హ‌జంగానే దీనికి భారీ స్పంద‌న వ‌చ్చింది.

నిజానికి గత రెండు రోజులుగా దావోస్‌ లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ఇప్పటికే అక్కడకు రావాల్సిన వివిధ దేశాల ప్రతినిధులు ఆలస్యంగా చేరుకుంటున్నారు. ఏకధాటికిగా కురుస్తున్న మంచు వల్ల హెలికాప్టర్ల ప్రయాణానికి అంతరాయం ఏర్పుడుతోంది. జురిచ్ నుంచి దావోస్‌ కు ఉన్న రైలు మార్గం రూట్లోనూ మంచు పేరుకుపోయింది. దీంతో రవాణా చాలా వరకు స్తంభించింది. గత ఆరు రోజుల్లో సుమారు 63 ఇంచుల మేర స్నో పడినట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 20 ఏళ్లకు ఓ సారి ఇలాంటి పరిణామాలను దావోస్‌లో చూస్తామంటున్నారు.